కేబినెట్ పునర్వ్యస్థీకరణకు కేసీఆర్ మొగ్గు!

Update: 2021-05-06 03:30 GMT
ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తీసేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇదే ఊపులో మరికొంత మంది మంత్రులకు ఉద్వాసన పలకాలని.. కేబినెన్ ను పునర్వ్యస్థీకరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పనిచేయని.. ఆరోపణలున్న మంత్రులను పక్కనపెట్టేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇక ఈటల తొలగింపుతో పార్టీలో అసంతృప్తి రాజ్యమేలుతోంది. ఈ దశలో కేబినెట్ విస్తరిస్తే మరింత దుమారం చెలరేగడం ఖాయం. ఈ క్రమంలోనే మొత్తం మందిని పక్కనపెట్టకుండా ఒకటి రెండు మార్పులకే కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా ఈటల స్థానంలో జడ్జర్ల ఎమ్మెల్యే సీ.లక్ష్మారెడ్డిని తీసుకొని వైద్యశాఖ అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తన కూతురు కవితకు అవకాశం ఇవ్వవచ్చని అంటున్నారు. కానీ బీసీ అయిన ఈటలను తీసి కూతురుకు మంత్రి పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట.. ఇప్పటికే తెలంగాణ కేసీఆర్ కుటుంబానిదా అని ఈటల సహా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

కేబినెట్ లో నలుగురు లేదా ఐదుగురికి ఉద్వాసన పలికి కొత్తగా ఉద్యమకారులకు అవకాశం ఇచ్చేలా కేసీఆర్ కనిపిస్తున్నారట..మరి వారు ఎవరు? ఎప్పుడొస్తారు? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News