కొత్త ముఖాల్ని సారు టీంలోకి తీసుకుంటున్నారా?

Update: 2020-11-12 01:30 GMT
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పాటు.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేబినెట్ లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి.. పనితీరు సరిగా లేని వారికి చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో కొందరు మంత్రులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలు బయటకు వచ్చి.. రచ్చగా మారటం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.

ఈ కారణంగానే.. కొందరు కొత్తవారిని టీంలోకి తీసుకొని ఇప్పటికే ఉన్న వారిని ఇంటికి పంపించే ఆలోచనలో తెలంగాణ సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాల్ని ఆయన ఇస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి ఆఖరులో కానీ.. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతుండటం.. ఆ వెంటనే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడాలన్న ఆర్డర్ ను పార్టీ నేతలకు వేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఫలితం తేడా కొడితే.. పదవులు ఊడిపోతాయన్న వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు భాద్యతను మంత్రులకు అప్పజెప్పిన కేసీఆర్.. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వారి మీదనే పెడుతున్నారు. ఒకవేళ తుది ఫలితంలో తేడా వస్తే.. ఉన్నపదవి పోయవటం ఖాయమని తేల్చిన నేపథ్యంలో మంత్రుల మెడ మీద కత్తి పెట్టినట్లుగా మారుతోంది. బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే నిండా కునుకు లేని పరిస్థితి.

దీనికి తోడు.. దుబ్బాకలో ఓటమి వారి నోటి నుంచి మాట రాకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కిందిస్థాయి నేతలంతా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయకపోవటాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో కారణం చెప్పి నామినేటెడ్ పదవుల్ని భర్తీని వాయిదా వేస్తున్నారని.. అలా చేయకుండా ఉత్తనే పని చేయించుకోవాటాన్నివారు ప్రశ్నిస్తున్నారు.

అవసరం వచ్చినప్పుడు.. దగ్గరకు పిలిపించుకొని మాట్లాడతారని.. ఆ సందర్భంగా పదవుల పంపకాల గుంచి ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ఎన్నికలు అయిపోగానే పదవులు ఇస్తానని చెప్పి.. ఆ తర్వాత మర్చిపోతుంటారని వాపోతున్నారు. ఈసారి మాత్రం ముందు సమస్యల మీద పోరాటం కంటే కూడా..నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. ఎన్నికల పర్వం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. నామినేటెడ్ పదవుల్లోని ఖాళీల్ని భర్తీ చేసే వీలుందంటున్నారు.
Tags:    

Similar News