కేసీఆర్ తొలిసారి గద్దెనెక్కాక ప్రవేశపెట్టిన 'కంటి వెలుగు' పథకం రెండో విడత 18న ప్రారంభం కానుంది. గత ఎన్నికల ముందు కొత్తగా కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకాన్ని.. మరోసారి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కంటి వెలుగు ప్రారంభమైన మొదట్లో యువకుల నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను కూడా ఉచితంగానే అందించారు. అయితే ఈ సీజన్ లో అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఉన్న కంటి సమస్యలను తొలగించేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. వారికున్న కంటి సమస్యలు పోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తులు సులువుగా గుర్తిస్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కారు గుర్తు కనిపించేందుకు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించేందుకు సిద్ధమవుతున్నారు.
కంటి వెలుగు రెండో విడతను రాష్ట్రవ్యాప్తంగా 16,588 ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 18 నుంచి జూన్ 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. యువకుల నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సుమారుగా 5.5 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. పంచాయతీ ఆఫీసులు, క్యాంపు ఆఫీసులు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రంథాలయాల్లో కంటి పరీక్షలుచేయనున్నారు. ఈ కార్యక్రమంలో 1500 మంది అప్తమాలజీ డాక్టర్లు పాల్గొంటారు. వీరితో పాటు ఇతర టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. కార్యక్రమానికి వారం ముందే క్యాంపు కార్యాలయాలకు సంబంధిత కిట్లు వెళ్లేలా డీఎంహెచ్ వో పర్యవేక్షించనున్నారు.
కంటి వెలుగు పథకం సక్సెస్ కావడానికి నేరుగా మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగనున్నారు. బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, చైర్మన్లు బాధ్యత వహించాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రజల మదద్దతు కూడగట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభలో కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కానీ ఆపరేషన్లు చేయడానికి చర్యలు తీసుకోలేదు. ఈ విడదలో ఆపరేషన్లు చేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పథకం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి ఎన్నికలే కారణమని తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడం ద్వారా ఎన్నికల్లో పార్టీ గుర్తులు బాగా కనిపిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్లు చీలకుండా ఉంటాయని అంటున్నారు.
గత రెండు ధపా ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ ఓట్లను బాగా చీల్చింది. ఇటీవల మునుగోడులోనూ అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. దీంతో సీక్వెన్స్ లో భాగంగా కారు గుర్తు స్థానాలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కారును పోలిన మరో గుర్తు ఉంటే మరోసారి ఓట్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ తప్పిదం వృద్ధులే ఎక్కువగా చేస్తున్నట్లు గ్రహించారు. ఈ నేపథ్యంలో వారికి బీఆర్ఎస్ కారు గుర్తు చక్కగా కనిపించేలా వారికి కంటి పరీక్షలు చేయిస్తున్నారన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే పించన్లతో వృద్ధులను ఆకట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు వారికి కంటి పరీక్షలు చేయించడం ద్వారా మరో సమస్యను పరిష్కరించిన వారవుతారు. ఎందుకంటే చాలా మంది వృద్ధుల్లో కంటి సమస్యలు ఉంటాయి. వారి కుమారులు, బంధువులు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఇప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకులా తమకు కంటి పరీక్షలు చేయిస్తున్నారని భావిస్తే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ వేసిన ఈ ప్లాన్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.