బండ్లు ఓడలు కావటం.. ఓడలు బండ్లు కావటం కామన్. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకప్పటి గురువులు ఇప్పుడు వరుస వైఫల్యాల్ని చవిచూస్తుంటే.. ఒకప్పటి శిష్యులు చెలరేగిపోవటమే కాదు.. కీలకభూమిక పోషిస్తున్న ఉదంతాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి దాకానో ఎందుకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇలాంటి ఉదంతాలు బోలెడన్ని కనిపిస్తాయి. టీఆర్ఎస్ అధినేతగా తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సంగతే దీనికి నిదర్శనం. ఒకప్పుడుమాజీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుంగ శిష్యుడిగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడా మాటను ఒప్పుకోవటానికి సైతం ఇష్టపడరేమో? కేసీఆర్ ప్రభ ఇంతలా వెలిగిపోతుంటే.. చంద్రబాబు ఇమేజ్ అంతకంతకూ దారుణంగా దెబ్బ తినటం చూస్తున్నదే.
తాజాగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలంగా వ్యవహరిస్తున్న రమణ వ్యవహారాన్ని చూస్తే.. ఇదే నిజమనింపించక మానదు. అప్పుడెప్పుడో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆయన.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసిందే. తనకంటే జూనియర్లు.. తన ముందు బచ్చాలుగా తిరిగిన వారంతా ఇప్పుడు కీలక పదవుల్లో ఉండటమే కాదు.. అధికారాన్ని అరచేతిలో పెట్టుకొని హడావుడి చేస్తున్న వైనం ఆయన్ను నొప్పిస్తూ ఉంటాయని చెబుతారు. 1996-98 మద్య ఎంపీగా వ్యవహరించిన రమణ.. అంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009-14లో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొద్దికాలానికే రాష్ట్ర మంత్రి పదవితో పాటు.. ఏపీ ఖాదీ గ్రామ పారిశ్రామిక బోర్డు ఛైర్మన్ గా వివిధ పదవుల్ని చేపట్టారు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేసీఆర్ కంటే జూనియర్ అయిన రమణ.. ఆయనకు దక్కని మంత్రి పదవి రమణకు ముందే దక్కినా.. ఇప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియంది కాదు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన్నుపార్టీలో ఆహ్వానించే విషయం మీద చాలానే చర్చ జరిగింది. ఒకప్పటి తనకు సన్నిహితుడైన రమణను.. కేసీఆర్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ.. మెడలో కండువా వేస్తారన్న అంచనాలు వినిపించాయి. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పార్టీలో చేరాల్సిన వైనాన్ని చూసిన వారంతా షాక్ తిన్నారు.
సైకిల్ దిగేసి.. గులాబీ కారు ఎక్కేసినంతనే ఆయనకు కీలక పదవి కట్టబెడతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి భిన్నంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన వైనం అండర్ లైన్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ ఎపిసోడ్ మీద రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఎంట్రీతోనే తానేమిటన్న విషయాన్ని కేసీఆర్ చేతల్లో చేసి చూపించారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రమణ ఎలానూ మాట్లాడే అవకాశం ఉందన్న విషయం తెలిసే పెద్దసారూ ఇలా చేశారంటున్నారు.
‘పార్టీలోకి ఆహ్వానించే సమయంలోనే ఆయన స్థానం ఏమిటన్న విషయాన్ని ఆయనకు స్పష్టంగా అర్థమయ్యేలా కేసీఆర్ చేశారు. ఇదంతా కావాలనే చేసింది.నిజంగానే కేసీఆర్ అనుకుంటే రమణ కోసం టైం కేటాయించలేని పరిస్థితేమీ లేదు. చిన్న కార్యక్రమాలకు సైతం కేసీఆర్ హాజరవుతారు. తనను కలవటానికి వచ్చే రైతుల్ని సైతం కలిసే ఆయనకు రమణ కోసం టైం కేటాయించలేని పరిస్థితా? రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రమణను పార్టీ మారుతున్న వేళ.. సాదరంగా ఆహ్వానించకపోవటానికి కచ్ఛితమైన కారణం ఉండి ఉంటుంది. రాజకీయాల్లో ఎంతటి సీనియర్ అయినా.. మరెంత పెద్ద పదవుల్ని చేపట్టినప్పటికీ.. తన పార్టీలోకి వచ్చే వారు తనకు లోబడే ఉండాలన్న సంకేతాన్ని ఇవ్వాలని కేసీఆర్ భావించి ఉంటారు’’ అని టీఆర్ఎస్ నేత ఒకరు విశ్లేషించారు.
అయితే.. .ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగినట్లుగా చెబుతున్నారు. పార్టీకి చెందిన సీనియర్లు పలువురు మంత్రి కేటీఆర్ అంటే పెద్దగా పడని పరిస్థితి ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వారందరికి హెచ్చరిక ఇచ్చేందుకు వీలుగా రమణ ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టి ఉంటారని చెబుతున్నారు. ‘‘ఈటలకు కేటీఆర్ కు మధ్య టర్మ్స్ సరిగా లేవన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే ఈటల మాత్రమే కాదు.. పలువురు సీనియర్ నేతలు ఇలాంటి మైండ్ సెట్ లోనే ఉన్నారు. తాము కేసీఆర్ సమకాలీకులమన్న భావన ఎక్కువ. అలాంటి వారు తమ తీరు మార్చుకోవాలన్న సందేశాన్ని ఇచ్చేందుకు రమణ పార్టీలో చేరే కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ చేతుల మీదుగా పార్టీలో చేరటం అన్నది.. పార్టీలో కేటీఆర్ కున్న ప్రాధాన్యతను తెలియజెప్పటంతో పాటు.. ఆయన టీంలోని వ్యక్తిగా రమణను చూపించాలన్న వ్యూహం ఉంది. ఇప్పటివరకు కేటీఆర్ టీంలో ఉన్నవారంతా జూనియర్లే. సీనియర్ అయిన రమణను కేటీఆర్ టీంలో సభ్యుడిగా చూపించటం ద్వారా మిగిలిన సీనియర్లను దారికి తెచ్చే ఉద్దేశం దాగి ఉంది’’ అని మరో సీనియర్ నేత వ్యాఖ్యానిస్తున్నారు. రమణను అవమానించారని అనుకోవటం సరికాదని చెబుతున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. రమణ లాంటి సీనియర్ నేతను పార్టీలో ఆహ్వానించిన తీరు మాత్రం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.