ఉద్యమనేతలకు కలలు ఎక్కువ. వారు తరచూ కలల్ని కంటుంటారు. అలాంటి కలల్లోనే వారు గడిపేస్తుంటారు. కలల్ని సాకారం చేసుకోవటం ఉద్యమకారులకు అంత సులువైన పని కాదు. వారెంత కష్టపడినా.. కాలం కలిసి రాకుంటే వారి కలలన్ని కల్లలుగానే ఉండిపోతాయి. దేశంలోనే కాదు.. ప్రపంచ స్థాయిలో చూసినా ఉద్యమకారుల కలలు ఎన్ని సాకారం అయ్యాయంటే చాలా తక్కువనే చెప్పాల్సి వస్తుంది. కానీ.. తెలుగు ఉద్యమనేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం అలా కాదు. ఆయన తీరు కాస్త భిన్నం.
ప్రతికూలత నుంచి మొదలెట్టి.. మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం ఆయనకు మాత్రమే సాధ్యం. సాకారం సాధ్యం కాదని భావించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో కీలకభూమిక పోషించిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థ మొత్తాన్ని మార్చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. జిల్లాల పెంపు వెనుక రాజకీయ ఉద్దేశం ఏమైనా.. అన్నింట్లోనూ తన మార్క్ కనిపించాలని.. తెలంగాణ వ్యాప్తంగా తన అడుగులు కనిపించేలా చేసేందుకు ఆయన తహతహలాడుతున్నారు.
మరో నెల వ్యవధిలో కొత్త జిల్లాల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆయన.. పాలనా పరంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా మరో 17 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆయన.. అందుకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో దసరా నాటి నుంచి ప్రతి జిల్లా ట్రెజరీకి కొత్త కోడ్ నంబర్లను ఇవ్వనున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లు మాత్రమే ఉంటారు తప్పించి జేసీలు ఉండరు. జేసీ పోస్ట్ లు రద్దు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో మారనున్న తెలంగాణ స్వరూపంతోపాటు.. పాలనా పరంగా మరిన్ని మార్పుల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
పాలనలో కొత్త విధానాల విషయంలో కేసీఆర్ అనుసరించనున్న విధానాల్ని చూస్తే..
= సంక్షేమ శాఖలన్నీ విలీనం కానున్నాయి. వివిధ స్థాయి అధికారుల పోస్టుల్ని విలీనం చేస్తారు. జిల్లా సంక్షేమ అధికారి పోస్టును సృష్టించి అన్ని సంక్షేమ శాఖల్ని ఆయన పర్యవేక్షణ చేసేలా చేస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తగ్గట్లే వివిధ కార్యాలయాన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. కొత్త జిల్లాల్లో పోలీసు కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తారు. కొత్త జిల్లా కేంద్రాలకు 70 మంది చొప్పున కేటాయిస్తారు. జోన్.. రేంజి విధానం ఎప్పటిలానే ఉన్నా.. వరంగల్ కమిషనరేట్ ను ఒక జిల్లాలోకి మారుస్తారు.
= నిఘా విభాగంలో ప్రాంతీయ అధికారులకు జిల్లాల బాధ్యతలుఅప్పగిస్తారు. అగ్నిమాపక శాఖలోని డీఎఫ్ వో పోస్ట్ ను డివిజనల్ అగ్నిమాపక అధికారిగా మార్చి జిల్లా బాధ్యత అప్పగిస్తారు. అవినీతి నిరోధక శాఖలో డీఎస్పీలకు ప్రాంతీయ అధికారుల హోదా కల్పిస్తారు.
= భారీ నీటిపారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థే కొనసాగుతుంది. ప్రస్తుతం పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధికి ఉన్న 9 సర్కిళ్లు ప్రాంతీయ కార్యాలయాలుగా మారతాయి. 22 ఈఈ డివిజన్లను 26 జిల్లాల కార్యాలయాలుగా మారుస్తారు. రోడ్లు.. భవనాల శాఖకు సంబంధించి 26 డివిజన్లను 26 జిల్లాలకు కేటాయిస్తారు. ప్రజారోగ్యశాఖలో 99ఈఈ.. 17 డీఈఈ పోస్టులను జిల్లా ప్రజారోగ్య ఇంజనీర్ పోస్టులుగా మారుస్తారు. ఇంటర్ బోర్డు.. శాఖలు విలీనమవుతాయి. పాఠశాల విద్యా శాఖలో డివిజన్ స్థాయి అధికారులు ఇకపై ఉండరు. సర్వశిక్షా అభియాన్.. ఆర్ఎంఎస్ ఏలను విలీనం చేస్తారు.
= వైద్య.. ఆరోగ్యశాఖ మొత్తానికి ఒక్కరే జిల్లా అధికారి ఉంటారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో పలు మార్పులుచేయనున్నారు. అదే విదంగా పరిశ్రమలు.. అనుబంధ శాఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఆర్థికశాఖలో కొత్త జిల్లాల్లో ట్రెజరీ.. సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గృహనిర్మాణశాఖ.. పౌరసరఫరాల శాఖల్లో కొన్ని పోస్టుల్ని రద్దుచేయటం.. మరికొన్నింటిని సృష్టించటం చేస్తారు. హైకోర్టును సంప్రదించి కొత్త జిల్లాల్లో కోర్టులు ఏర్పాటు చేస్తారు. అప్పటివరకూ పాతవే కొనసాగేలా చేస్తారు. కొత్త కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారుల బాధ్యతలు చేపడతారు.