భర్త ఆశీస్సులతో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత !

Update: 2020-03-18 12:00 GMT
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్ ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ , సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. కవిత ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆమె ఇంటి వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు కవిత తన భర్త కాళ్ళకి మొక్కి, భర్త ఆశీర్వాదం తీసుకుంది. మాజీ ఎంపీ , సీఎం కూతురు అయినా కూడా ఒక సాధారణ గృహిణిలానే భర్త కాళ్ళకి దండం పెట్టుకొని , అయన ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి వెళ్ళింది. పలువురు టిఆర్ ఎస్ నేతలతో కలిసి వెళ్లిన కవిత నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కవిత చాలా సునాయాసంగా గెలుస్తారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌, బీజేపీ బరిలో నిలిచినప్పటికీ..ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 592 ఓట్లుండగా, కాంగ్రెస్‌ ఓట్ల సంఖ్య 142, అలాగే బీజేపీకి 90 ఓట్లున్నాయి. దీనితో కవిత గెలువు నల్లేరుమీద నడకే. గత ఏడాది ఏప్రిల్‌ లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించలేదు. అలాగే ఆమె ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం ఖాయం కావడంతో ..త్వరలోనే కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా భాద్యతలు స్వీకరించబోతుంది అని టి ఆర్ ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Tags:    

Similar News