కాంగ్రెస్ లో గెలిచింది మొత్తం 19మంది ఎమ్మెల్యేలు. అందులో టీఆర్ ఎస్ లోకి జంప్ అయ్యింది 11 మంది ఎమ్మెల్యేలు. మరో ఇద్దరు టీఆర్ ఎస్ గోడ దూకేస్తే టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైపోతుంది. ఆ ముచ్చట కోసమే టీఆర్ ఎస్ ఎదురుచూస్తోంది. ఈ దెబ్బకు టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు. వారు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మరి టీఆర్ ఎస్ లోకి జంప్ చేసే ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరన్న టెన్షన్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తెలంగాణలో ఫలితాలు అంతా ఏకపక్షంగా ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టీఆర్ ఎస్ ఊపును కాంగ్రెస్ తట్టుకోలేదు. అదే సమయంలో కాంగ్రెస్ కాడి వదిలి కారెక్కే నేతల వలసలను కూడా ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అయితే ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయన్న టెన్షన్ కంటే టీఆర్ ఎస్ లో సీఎల్పీ విలీనంపైనే కాంగ్రెస్ ఎక్కువ ఆందోళన చెందుతోందట.. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరితే కాంగ్రెస్ పక్షమే విలీనమైపోతుంది. దీంతో ఎవరా ఇద్దరు అనే ప్రశ్న కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ - సీఎల్పీ నేత భట్టి విక్రమార్క - శ్రీధర్ బాబు - జగ్గారెడ్డి - పోడెం వీరయ్య - సీతక్క - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - రోహిత్ రెడ్డి.. ఈ 8మంది మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలారు. వీలైనంత తొందరగా ఇద్దరిని లాగి కాంగ్రెస్ విలీనానికి కేసీఆర్ స్కెచ్ గీశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే లోపాయికారిగా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని ఆ పార్టీలో చర్చసాగుతోందట. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి - భద్రచలం ఎమ్మెల్యే పోడం వీరయ్యలు కాంగ్రెస్ ను వీడుతారా లేదా అన్న అంశం చుట్టూ ఇప్పుడు జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే సంగారెడ్డిలో ఉన్న కేసీఆర్ బంధువులు జగ్గారెడ్డితో చర్చలు జరిపారని సమాచారం. అయితే జగ్గారెడ్డి మాత్రం అటు కాంగ్రెస్ ను వీడను.. ఇటు టీఆర్ ఎస్ లోకి రాను అని ఏదీ తేల్చడం లేదట.. ఆయన ఊగిసలాటలో ఉన్నారట.. కేసీఆర్ స్వయంగా హామీనిస్తే వస్తానని అంటున్నాడట జగ్గారెడ్డి. 2004లో కేసీఆరే జగ్గారెడ్డిని టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత తీవ్ర విభేదాలతో విడిపోయారు. పాత స్నేహంతో కేసీఆర్ పిలిస్తే జగ్గారెడ్డి ఖాయం. కానీ అది జరుగుతుందో లేదో చూడాలి.
ఇక భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే టీఆర్ ఎస్ భారీ ఆఫర్ ఇస్తోందట.. కానీ పోడెం వీరయ్యకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో ఆయన కారెక్కే విషయంలో ఆలోచిస్తున్నారట.. భట్టి విక్రమార్క మాట్లాడడంతో కాస్త వెనక్కి తగ్గారని సమాచారం. కానీ లోలోపల జగ్గారెడ్డి, వీరయ్యలకు టీఆర్ ఎస్ ఆఫర్ ను తీసుకోవాలనే ఆసక్తి ఉన్నట్టు సమాచారం.
టీఆర్ ఎస్ లో సీఎల్పీ విలీనం కావాలంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావాలి. ఆ ఇద్దరు జగ్గారెడ్డి - వీరయ్యలేనన్న చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది. మరి వీరు ఊగిసలాటకు చెక్ చెప్పి గులాబీ పార్టీలో చేరితే కాంగ్రెస్ విలీనం ఖాయం. కానీ ఆ పనిచేస్తారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.