స్వంత రాష్ట్రం వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు. మనం రాఫ్ట్రంలో ఇక నిరుద్యోగ సమస్యే ఉండదు. ఇలాంటి ప్రకటనలు చేశారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ వచ్చింది. ఎన్నికలూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి మ్యానిఫెస్టోలోనూ... ఎన్నికల ప్రచార సభల్లోనూ ఇంటికో ఉద్యోగం అంటూ ప్రకటనలూ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చారు. ఇక ఉద్యోగాల భర్తీ ఒక్కటే మిగిలిందని తెలంగాణ నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయ్యింది. దానికి కొన్నాళ్లు జర్నలిస్టుగా... మరికొన్నాళ్లు అధ్యాపకునిగా ఉన్న వారిని చైర్మన్ - ఇతర సభ్యులుగా నియమించారు. ఇంతవరకూ బాగానే ఉంది.
అయితే ఆ తర్వాత చేపట్టాల్సిన ఉద్యోగ ఖాళీల భర్తీలే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయ్యింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. అయితే రాష్ట్రంలో అధ్యాపక ఖాళీలు మాత్రం సర్కారును వెక్కిరిస్తున్నాయి. వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో విద్యార్ధులకు ఆయా సబ్జెక్టులు బోధించే వారు కరవయ్యారు. కేవలం అధ్యాపకులే కాదు... బోధనేతర సిబ్బంది కూడా లేకపోవడంతో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ - డిగ్రీ కళాశాలలు దిగాలుగా ఉన్నాయి.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు - జూనియర్ - డిగ్రీ కళాశాలల్లో ఎనిమిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కులు చెబుతున్నాయి. వీటికి నోటిఫికేషన్లు ఇంత వరకూ ఇవ్వకపోవడంతో ఈ విద్యా సంవత్సరం కూడా అధ్యాపకులు లేకుండా కాలం గడిపేయాలా అని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 404 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4500 అధ్యాపక ఖాళీలున్నాయి. ఇక 131 డిగ్రీ కళాశాలల్లో 1300 ఖాళీలున్నాయి. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు బోధించే వారు తక్కువైపోయారు. ప్రభుత్వం తెలుగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ తెలుగు మహాసభలు కూడా నిర్వహించింది. అయినా తెలుగు భాషను బోధించేందుకు మాత్రం అధ్యాపకులు లేకపోవడం దారుణమని అధ్యాపక సంఘాలు - ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంత వరకూ కాంట్రాక్ట్ లెక్చరర్లతో కాలం వెళ్లదీసారు. వారిలో కొందరిని ఇటీవల తొలగించారు కూడా. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఖాళీలతో విద్యార్ధులు సతమతమవుతున్నారు. సర్కార్ సాధ్యమైంత త్వరగా ఖాళీలను భర్తీ చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రతి విషయంలోనూ చేయికి ఎముక లేకుండా హామీలిచ్చే కేసీఆర్ ఎందుకు నిరుద్యోగులపై పగబట్టారు అని కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.