రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ధోరణికి సంబంధించిన విషయానికి వస్తే.. ఆయన నోటి వెంట ఏదైనా మాట వచ్చిందంటే.. అంత ఆషామాషీ విషయం కాదు. ఏదైనా సాంకేతిక అంశాల మీద ఆయన నోరు విప్పారంటే ఎంతో కసరత్తు చేసి.. దానికి సంబంధించిన వివరాల్ని సేకరించి.. పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతారు. అంతేకాదు.. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ముక్కున పెట్టుకొని చీదేసే లక్షణం ఆయనలో అస్సలు కనిపించదు. అలాంటి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ‘‘లా నినా’’ మాట మీద ఇప్పుడు చర్చ మీద చర్చ సాగుతోంది.
ఇటీవల కురుస్తున్న అతి భారీ వర్షాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘లా నినా’ అన్న మాటను ప్రస్తావించారు. ఎల్ నినో గురించి చాలామందికి తెలుసు కానీ లా నినా గురించి తెలిసిన వారు కాస్త తక్కువే. ఇక.. ఎల్ నినో సందర్భంగా వర్షాలు తక్కువ పడితే.. లా నినా కారణంగా వర్షాలు బాగా పడతాయి. తాజాగా కురిసిన వర్షాలు లా నినా కారణమని.. మరో నాలుగేళ్లు ఇలానే వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నోట వచ్చిన లా నినా షురూ అయ్యిందన్న మాట తర్వాత ఈ అంశం మీద ఫోకస్ చేస్తే.. లా నినా అనేది ఇంకా రాలేదని నాసా చెప్పిన మాట ప్రముఖంగా కనిపిస్తుంది.
ఏదైనా అంశంపై మాట్లాడే ముందు అన్ని విషయాల్ని గమనంలోకి తీసుకున్నాకే కేసీఆర్ మాట్లాడతారు. అలాంటిది ఈ విషయం మీద ఎందుకు తప్పుగా మాట్లాడారన్న విషయాన్ని మరింత లోతుగా చెక్ చేస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. లా నినా వచ్చేసిందని కేసీఆర్ చెప్పిన మాటకు నాసా వాదన భిన్నంగా ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తూ.. తెలంగాణ సీఎం చెప్పిన సమాచారం తప్పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక విషయం గురించి అవగాహన లేకుండా మాట్లాడతారా? అన్న చర్చ మొదలైంది.
దీంతో.. ఈ అంశంపై కొందరు మరింత దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే లా నినా వచ్చేసిందన్న కేసీఆర్ మాట తప్పన్నట్లుగా నాసా ప్రకటన ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు కరెక్ట్ అనేలా జపాన్ అధికారుల ప్రకటన ఉండటం కనిపిస్తుంది. ఒకే అంశానికి సంబంధించి నాసా ఒకలా.. జపాన్ అధికారులు మరోలా ఎందుకు సమాచారం ఇస్తున్నారన్న అంశంపై కసరత్తు చేసినప్పుడు లా నినా ఏర్పడుతుందని చెప్పటానికి పెట్టుకున్న ప్రమాణాలు వేర్వేరుగా ఉండటంతో ఈ తేడా వచ్చినట్లుగా తేలింది. పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు.. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లా నినాగా వ్యవహరిస్తారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడుతుంటాయి. జపాన్ అధికారుల లెక్కల ప్రకారం లా నినా ఇప్పటికే వచ్చేసిందని చెబుతుంటే.. నాసా మాత్రం ఇంకా అలాంటిది లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో నాసా కోణంలో చూస్తే కేసీఆర్ మాట తప్పుగా చెప్పాలి. అదే.. జపాన్ అధికారుల మాటను ప్రాతిపదికగా తీసుకుంటే కేసీఆర్ కరెక్ట్ గా చెప్పినట్లు చెప్పాల్సిందే.