నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో అద్భుతమైన విజయం సాధించిన గులాబీ శ్రేణులు ఫుల్ జోష్ మీదున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో పార్టీకి అంతా కలిసి వస్తోందని సంబరపడుతున్నాయి. అయితే అదే సమయంలో తమను మాత్రం అధినేత కేసీఆర్ కనికరించడం లేదంటూ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇంతకీ పార్టీ నేతల ఆవేదన అంతా...ఎప్పుడెప్పుడా అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్న పదవుల పందేరం గురించి, గులాబీ దండులో జరుగుతున్న నిరీక్షణల పర్వం గురించి.
తెరాస ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి దాదాపు 20 మాసాలు గడస్తున్నా పదవుల పందేరం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది వివిధ కారణాల వల్ల వాయిదాపడ్డప్పటికీ నూతన సంవత్సరంలో ఆరంభం నుంచే పదవుల పందేరం జరపాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావించారు. నామినేటేడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు ఈమేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో స్వయంగా ప్రకటించారు కూడా. అయితే జనవరిలోగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పదవుల పందేరం ఆగిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అప్రతిహత విజయం సాధించడంతో పాటు తాజాగా నారాయణఖేడ్‌లో కూడా కారు జోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇదే వేడిలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకూ మంచి సమయమని అధికార పార్టీ భావిస్తుంది.
ఈమేరకు ఈనెల 20లోగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపల్ పట్టణాలకూ ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల కాబోతుందని సమాచారం. ఈ ఎన్నికలకు ముందు పదవుల పందేరం నిర్వహిస్తే పదవులు దక్కనివారు పార్టీ విజయానికి కృషి చేయకపోవచ్చని, అలాకాకుండా ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామనడం వల్ల పార్టీ విజయానికి అందరూ కష్టపడతారని పార్టీ అధిష్టానం భావిస్తుంది. పైగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే మార్చి మొదటివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు మార్చి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మొదటివారంలో కసరత్తు ప్రారంభించి, రెండోవారంలో నియామకాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెరాస వర్గాల సమాచారం.
అయితే తెరాసలో చేరి ప్రత్యేక రాష్ట్ర సాధనకు 14ఏళ్లు కష్టపడినప్పటికీ, పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఇంకా తమకు పదవులు దక్కకపోవడం పట్ల పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారి శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాతైనా పదవులు దక్కుతాయన్న గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.