2014 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వేర్వేరు ఎన్నికలను ఎదుర్కొన్నది. ఉప ఎన్నికలు అనేకం వచ్చాయి. ప్రతిసారీ గులాబీ పార్టీనే విజయం సాధించింది. కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అందుకే వరుస విజయాలు దక్కుతున్నాయని వారు ప్రచారం చేసుకున్నారు. అయితే ఇది జరిగి చాలాకాలం అయింది. ఆతర్వాత కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది.. ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లుగా సర్వజనరంజకంగానే ఉన్నదా లేదా.. ప్రజలు దీనిని ఏవగించుకుంటున్నారా అనేదానికి అటు పాలకపక్షమూ ఇటు ప్రతిపక్షాలూ చెప్పే మాటలే తప్ప.. సాధికారమైన నిరూపణ ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. సిం గరేణి కాలరీస్ అంటేనే తెలంగాణ జీవనాడి. తెలంగాణ ప్రజల భావజాలాన్ని ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రతిబింబించే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికలను కేసీఆర్ సర్కారుకు లిట్మస్ టెస్ట్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.
దానికి తగినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఒక్కటే తక్కువ. సింగరేణి కార్మికులను ఊరించే అనేక హామీలను ఆయన హైదరాబాదు నుంచే ప్రకటించారు. వారిని ఆకర్షించే పథకాలు ఏకరవు పెట్టారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను అంతకంటె ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సాధారణంగా వామపక్షాలకు బలం ఉండాల్సిన ఎన్నికల్లో.. విపక్షాలు ఉమ్మడిగా తెరాసతో పోటీ పడుతున్నాయి. అంటే దాదాపుగా ద్విముఖ పోటీ లాగానే జరుగుతోంది. తెరాస సంఘం తరఫున మంత్రులు, ప్రత్యేకించి ఎంపీ కల్వకుంట్ల కవిత ముమ్మర ప్రచారం నిర్వహించారు కూడా.
ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు లిట్మస్ టెస్టులా ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత.. సింగరేణి కాలరీస్ లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఇక్కడ కూడా గెలిచి తమ సత్తా చాటుకోవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద ఏ కొంచెం వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పటికీ.. అది సింగరేణి కాలరీస్ ఎన్నికల్లో తప్పకుండా ప్రతిబింబిస్తుందనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది. నిజంగానే తెలంగాణ ఆరు జిల్లాల్లో విస్తరించిన బొగ్గుగనుల కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలు గనుక వీటికి అంత ప్రాధాన్యం ఉంది. మరి పాలకపక్షం ఎలాంటి ఫలితాలను చవిచూస్తుందో చూడాలి.