తెలంగాణ ఉద్యమసారథిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురించి అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో మాత్రం ఏమాత్రం ఉపేక్షించని నేతగా కేసీఆర్ ఉంటారు. ఇది ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్లకు మాత్రమే తెలుసు. కొడుకైనా.. కూతురైనా.. కేసీఆర్ ఆర్డర్ వేస్తే పాటించాల్సిందే అన్నంత కఠినంగా ఉంటారు. తాజాగా కొడుకు కేటీఆర్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేపుతోంది..
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని చేపట్టారు. ప్రతీ రైతుకు పంటకు ఎకరానికి రూ.4వేల పెట్టుబడి సాయం చెక్కులను అందజేస్తున్నారు. దేశం మొత్తం తనవైపు తిప్పుకున్న ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారట.. ఈనెల 11నుంచి 17వరకు జరిగిన ఈ చెక్కుల చెల్లింపులో ప్రతీ ఎమ్మెల్యే పాల్గొనాలని రైతులకు వారే స్వయంగా చెక్కులు అందించాలని కేసీఆర్ అల్టీమేటం జారీ చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా ఈ వారం రోజులు హైదరాబాద్ లో ఉండొద్దంటూ హుకూం జారీ చేశాడట.. దీంతో అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు గడిచిన వారం రోజులుగా తెలంగాణ జిల్లాల్లో తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు చెక్కులు పంచుతూ తిరుగుతున్నారు. ఎంతో లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని రైతులకు స్వయంగా ఇవ్వడం వల్ల ఆయా ఎమ్మెల్యేలకు ఓట్లు పడతాయని కేసీఆర్ ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్ - తన కొడుకు కేటీఆర్ ను వదలలేదు. హైదరాబాద్ లో, ఇతర సమావేశాలతో బిజిబిజీగా ఉండే కేటీఆర్ గడిచిన వారం రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాత కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో తిష్ట వేశారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని గ్రామాలు తిరుగుతూ చెక్కులు అందజేస్తున్నారు. నడవలేని వృద్ధుల ఇంటికి వెళ్లి మరీ చెక్కులను స్వయంగా అందజేస్తున్నారు.. వారం రోజులుగా కేటీఆర్ కోసం హైదరాబాద్ లో వెతికిన ప్రజలు - మీడియా - ఇతర ప్రముఖులకు కేటీఆర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సిరిసిల్లకు ఎప్పుడో నెలకోసారి వచ్చే కేటీఆర్ వారం రోజులుగా నియోజకవర్గంలోనే ఉండడంతో స్థానిక నాయకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అందరూ ఎమ్మెల్యేల లాగే కేటీఆర్ కూడా తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో చెక్కులు పంచుతూ తిరుగుతుండడం విశేషంగా చెప్పవచ్చు.
కేసీఆర్ ది మాటంటే మాట.. ఏ ఒక్క ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉండొద్దు అన్నాడు. తన కొడుకు కేటీఆర్ కు కూడా ఇందులో మినహాయింపు ఇవ్వలేదు. ప్రజలకు డైరెక్ట్ గా మేలు చేసే ఇలాంటి పథకంలో పాలుపంచుకుంటే టీఆర్ఎస్ కు ఓట్లు పడతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ స్కెచ్ వేశారు. అందుకే గడిచిన వారం రోజులుగా టీఆర్ఎస్ ముఖ్యులు ఎండల్లో తిరుగుతూ కష్టపడుతున్నారు. హైదరాబాద్ విడిచి వారం రోజులు ఎక్కడా లేని కేటీఆర్ సైతం సిరిసిల్లలో ఉంటుండడం ఆసక్తి రేపుతోంది.