బ్రేకింగ్ : ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు..కేసీఆర్ కీలక నిర్ణయం!

Update: 2020-03-27 12:58 GMT
తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. 60 వేల మందికి వచ్చినా ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి తోడు అదనంగా మరికొంతమంది డాక్టర్లు - మెడికల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం 14 వేల మందిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

అయితే , తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా 59కి పెరిగాయి. శుక్రవారం   ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ సంచలన విషయం వెల్లడించారు. ఈ 59 కేసుల్లో పూర్తిగా కోలుకున్న ఒకరిని ఇప్పటికే డిశ్చార్జ్ చేయగా.. మిగిలిన 58 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎవరికీ ప్రమాదం లేదని తెలిపారు. రో 25 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి - లాక్ డౌన్ పరిస్థితులపై మంత్రులు - అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ - కర్ఫ్యూ లేకపోతే పరిస్థితులు భయంకరంగా మారేవని - కరోనా వైరస్ విజృంభిస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని పదే పదే చెప్పుకొచ్చారు. అలాగే ఈ కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించవద్దని - ఏపీకి చెందిన ప్రజలను  - అలాగే తెలంగాణ లో ఉంటున్న ఈ రాష్ట్రం వారినైనా  కూడా కాపాడుకుంటామని... వారికి ఇబ్బందులు రాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ ఏ అనుమానాలు పెట్టుకోవద్దని కేసీఆర్ హామీ ఇచ్చారు.

పరిశీలకుల అంచనా ప్రకారం అమెరికా - చైనా - స్పెయిన్‌ - ఇటలీ స్థాయిలో మనదేశంలో వైరస్‌ వ్యాప్తి చెందితే 20 కోట్ల మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ఆపత్కాల సమయంలో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు’ అని కేసీఆర్ కోరారు. ఉదయమే ప్రధాని మోదీతో మాట్లాడానని... సంపూర్ణ సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చినట్టు కేసీఆర్ తెలిపారు.


Tags:    

Similar News