తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానించేందుకు ఆయన విజయవాడకు వచ్చారు. చంద్రబాబు ఇంటి గేటు ఎదుట నేరుగా హెలికాప్టర్ దిగిన సీఎం కేసీఆర్ కు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప - యనమల రామకృష్ణుడు - రావెల కిశోర్ బాబు - కామినేని శ్రీనివాస్ - అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్ - ఎంపీ సుమన్ ఉన్నారు.
కాగా కేసీఆర్ చంద్రబాబును కుటుంబసమేతంగా యాగానికి రావాలని ఆహ్వానించనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు చంద్రబాబు ఇంట్లోనే విందారగించి ఆ తరువాత కనీసం గంట పాటు చర్చించుకోనున్నారు. అంతర్రాష్ర్ట సమస్యలపై వారిమధ్య చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
కేసీఆర్ కోసం రెఢీ చేసి మెనూ ఇదే..
కేసీఆర్ కోసం ప్రత్యేక విందును చంద్రబాబు సిద్ధం చేశారు. మంచి భోజన ప్రియుడైన కేసీఆర్ కు ఇష్టపమైన పలు ఐటెమ్స్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మెనూలో మొత్తం 15 రకాల ఐటెమ్స్ ను తయారు చేయించినట్లు చెబుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో.. కేసీఆర్ కు వడ్డించే మెనూ చూస్తే..
= నాటుకోడి పులుసు
= రోటీ
= గోంగూర
= ఉలవచారు
= టమోటా పప్పు
= మజ్జిగ పులుసు
= ములక్కాయ సాంబారు
= బిరియానీ
= గడ్డ పెరుగు
= పూత రేకులు
= కాజాలు
= వివిధ రకాల ఫండ్ల ముక్కలు తదితరాలు