ఇద్దరు చంద్రుళ్ల మధ్య భేటీ ముగిసింది. అనుకున్న దానికి మించి ఇరువురి మధ్య సహృద్భావ వాతావరణంలో షెడ్యూల్ కార్యక్రమం పూర్తి అయ్యింది. తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించటం కోసం బెజవాడకు వెళ్లిన కేసీఆర్ కు చక్కటి మర్యాదలు చేశారు. దాదాపు 15 రకాల ప్రత్యేక వంటకాలు తయారు చేసి విందు ఇచ్చారు. ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు. అనంతరం కేసీఆర్ కు చంద్రబాబు ఘనంగా వీడ్కోలు పలికారు.
హెలికాఫ్టర్ దగ్గర ఎక్కించేందుకు ఏపీ మంత్రుల బృందం కేసీఆర్ తోడుగా వెళ్లింది. ఒకవైపు కృష్ణమ్మ.. మరోవైపు పచ్చటి తోటలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు.. మంచి విందుభోజనం చేయటం వల్ల కాబోలు.. కాస్తంత దమ్ము కొట్టాలనిపించినట్లుంది. గతంలో తరచూ సిగిరెట్లు తాగే అలవాటున్న కేసీఆర్.. ఈ మధ్య కాలంలో సిగిరెట్ అలవాటును పూర్తిగా తగ్గించేశారు. అప్పుడప్పుడు మాత్రమే సిగిరెట్లు కాలుస్తుంటారు.
మాంచి మూడ్ లో ఉన్న కేసీఆర్ సిగిరెట్ తీసి కాల్చటం కనిపించింది. అలాంటి దృశ్యాన్ని ఎంతమాత్రం విడిచిపెట్టని మీడియా ప్రతినిధులు.. దాన్ని తమ కెమేరాల్లో బంధించారు. తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన యనమలతో మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మేసిన దృశ్యం పలువురి దృష్టిని ఆకర్షించింది.