న‌న్ను ఢిల్లీ పంపండి- కేసీఆర్ !

Update: 2018-12-03 13:44 GMT
న‌న్ను ఢిల్లీ పంపండి- కేసీఆర్ !ఇంత‌కాలం పాలించిన పార్టీలు ఒక‌వైపు... ఈ నాలుగేళ్లు పాలించిన ఉద్య‌మ పార్టీ ఒక‌వైపు... ఆలోచించి మీ చైత‌న్యంతో ఓటు వేయండి. ఎందుకంటే ఖ‌మ్మం బాగు కోసం - మ‌న తెలంగాణ బాగు కోసం టీఆర్ ఎస్ గెల‌వాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మ‌నం సొంతంగా పాలించుకుంటే ఏం జ‌రుగుతుందో నిరూపించుకున్నాం... స్వ‌యంపాల‌న‌లో ఇంకా ఎన్నో చేయ‌గ‌లం. టీఆర్ ఎస్ గెలిస్తే నేను ఢిల్లీకి వెళ్లి చీల్చి చెండాడుతాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పిడ‌మ‌ర్తి ర‌వి పోటీ చేస్తున్న ఖ‌మ్మం జిల్లా స‌త్తుపల్లిలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రంలో ఏ రిపోర్టు చూసిన తెలంగాణ అభివృద్ధి క‌నిపిస్తుంది. అస‌లు దేశంలో 24 గంట‌ల ఉచిత క‌రెంటు రైతుకు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. ఇది స్వ‌యం పాల‌న వ‌ల్ల జ‌రిగిన అద్భుతం. ఇలాంటి అద్భుతాలు మ‌రిన్ని జ‌ర‌గాలంటే... టీఆర్ ఎస్ గెల‌వాలి - ఢిల్లీని మ‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని కేసీఆర్ అన్నారు.

మీకు ఏమైనా అపోహ‌లు ఉంటే... వాటిని తొల‌గించుకుని ర‌వికి ఓటేసి గెలిపించండి. సీతారామ ప్రాజెక్ట్‌ తో ఖమ్మంకు నీరు అందుతుంది. మ‌న ఖమ్మం ఇంకా క‌ళ‌కళ‌లాడుతుంది. రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ కావాలన్నా.. చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు. ఇది ప్ర‌జ‌లు ఎరుక‌తో గ‌మ‌నించాల‌న్నారు.
 
ఢిల్లీ వెళ్లాల్సిందే... పాతికేళ్ల క్రితం చైనా మ‌న‌కంటే వెన‌కుంది. ఇపుడు వాళ్ల‌కంటే మ‌నం వెనుక‌ప‌డ్డాం. క‌ష్ట‌ప‌డితే ఏదైనా సాధ్యం... అవినీతిని త‌గ్గించి ఇసుక ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచుకున్నాం. ఇంకా ఆదాయం పెరిగే మార్గాలున్నాయి. దోపిడీదారుల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు అని కేసీఆర్ ఓట‌ర్ల‌ను కోరారు. తెలంగాణ రైతు లాగే దేశంలో రైతులంతా బాగుండాల‌ని కేసీఆర్ అభిల‌షించారు. రైతు గురించి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేసిన ఆలోచ‌న ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన‌ది... రైతుబంధును ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ ప‌థ‌కం విష‌యంలో అభినందించింది. చూసి చూసి.. తెలిసి తెలిసి... ఇలాంటి అదృష్టాన్ని పోగొట్టుకోకూడ‌దు క‌దా అని కేసీఆర్ అన్నారు.


Tags:    

Similar News