చంద్రబాబుకు సభలో మైకు దొరికితే చాలు... అది ఏ సభ అయినా పర్లేదు. హైదరాబాదు నేనే కట్టా అంటాడు. అదేదో సినిమాలో పేరు గుర్తుంచుకోవడానికి హిట్లర్ హిట్లర్ అన్నట్లు చంద్రబాబు హైదరాబాదును మరిచిపోకుండా ఉండటానికి ఆ మాట అంటున్నట్లు ఉంటుంది. ఇప్పటికి కనీసం ఆయన స్వయంగా హైదరాబాదును నేనే కట్టాను అని ఒక వెయ్యిసార్లు అయినా అని ఉంటాడు. అందులో 200 సార్లు గత నెలలోనే అనే ఉంటాడు చంద్రబాబు. ఆ బాబుకు కేసీఆర్ ఈరోజు తాజా పంచ్ ఇచ్చాడు.
*హైదరాబాదును కట్టినోడికి అమరావతిలో ఒక్క బిల్డింగ్ కట్టడం చేత కాలేదని, హైదరాబాదును ఆయన కడితే మరి కులీకుతుబ్‌షా ఏం కట్టిండు?* అని కేసీఆర్ వ్యంగాస్త్రం వేశారు. హైదరాబాదు చల్లగా ఉండాలని కులీకుతుబ్ షా నమాజ్ చేసి చార్మినార్ ను నిర్మించారు... భవిష్యత్తులో చంద్రబాబు అది కూడా నేనే కట్టాను అంటాడని.. చంద్రబాబు మాటలు వింటే కులీకుతుబ్‌షా ఆత్మహత్య చేసుకుంటాడని అన్నారు కేసీఆర్.
అన్నిగొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో తెలంగాణను చంద్రబాబు కూడా పాలించారు. ఇపుడు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. మరి ఆ మహానుభావుడు అపుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు. మాటలు ఎవరైనా చెప్పగలరు. మాట్లాడే ముందు మాటకు శాంక్టిటీ ఉండాలని కేసీఆర్ చంద్రబాబుకు సూచించారు. సమైక్య పాలనలో తెలంగాణలో జీవన విధ్వంసం జరిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పరిగిలో మాట్లాడిన కేసీఆర్ ఒక తాజా విషయం వెల్లడించారు. అందులో రాబోయే ఎన్నికల్లో 103-106 సీట్లు రానున్నట్టు తెలిసిందట. అసెంబ్లీ రద్దు చేసేనాటికి 100 వస్తాయనుకున్నాం. కానీ మా గ్రాఫ్ ఇంకా పెరిగిందని కేసీఆర్ అన్నారు.