గురువారం మ‌ధ్యాహ్నం 2 పీఎం ప్ర‌త్యేక‌త ఏమిటి?

Update: 2018-09-05 05:55 GMT
మ‌హా అయితే రెండు రోజులు. దీంతో.. గ‌డిచిన కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముంద‌స్తుకు వెళ్ల‌నున్న విష‌యంపై సాగుతున్న ఊహాగానాల‌కు చెక్ ప‌డ‌టం ఖాయం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్ కు పంప‌నున్న విష‌యం వార్త‌ల రూపంలో వ‌చ్చేసింది. ఈ బిగ్ బ్రేకింగ్ ఇప్పుడు పాత వార్త‌. మ‌రి.. ఇందులో కొత్త వార్త ఏమిటంటే..గురువారం అస‌లేం జ‌ర‌గ‌నుంది?  

అసెంబ్లీని ర‌ద్దు చేసేందుకు కేసీఆర్ తాను న‌మ్మే తారాబ‌లంలో దేన్ని న‌మ్ముకున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో ఏక‌వాక్య తీర్మానాన్ని చేస్తారు.

స‌రిగ్గా 2 గంట‌ల‌కు అసెంబ్లీని ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా తీర్మానాన్ని ఆమోదిస్తారు. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే ఎందుకంటే.. కేసీఆర్ జాత‌క రీత్యా క‌లిసి వ‌చ్చే యోగం ఉండ‌ట‌మే కార‌ణంగా చెప్పాలి. తిథి.. వార‌.. న‌క్ష‌త్ర‌.. తారాబ‌లాల్ని విప‌రీతంగా నమ్మే కేసీఆర్‌.. సాధ‌కుల‌కు అత్యంత అనుకూలంగా ఉండే గురు-పుష్య యోగంలో అసెంబ్లీ ర‌ద్దుకు తీర్మానం చేయాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

మంత్రివ‌ర్గం తీర్మానం చేసిన వెంట‌నే.. ఆగ‌మేఘాల మీద గ‌వ‌ర్న‌ర్ కు తీర్మానం కాపీ అందుతుంది. అక్క‌డి నుంచి బంతి గ‌వ‌ర్న‌ర్ కోర్టులో ఉంటుంది. అయితే.. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. కేసీఆర్ ఇచ్చిన అసెంబ్లీ ర‌ద్దు తీర్మానంపై వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.  గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర ప‌డిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అడుగులు వేసుకుంటూ ఎలాంటి కోర్టు చిక్కులు త‌లెత్త‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఇంత ప‌క్కా ప్లానింగ్ ను దెబ్బ తీసేలా ఏమైనా చిక్కులు త‌లెత్తుతాయా?  ఈ క‌థ మొత్తానికి భారీ ట్విస్ట్ ఏమైనా ఉందా? అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Tags:    

Similar News