కేసీఆర్.. మళ్లీ ఆశ్చర్యపరిచాడు

Update: 2020-09-06 03:39 GMT
ఎవ్వరూ ఊహించనది చేయడంలో కేసీఆర్ ముందుంటారు. అది తెలిశాక అందరూ అవాక్కవుతారు. కేసీఆర్ స్పెషాలిటీయే అది. పరిపాలనలోనే కాదు.. ప్రజా సంబంధాల విషయంలోనూ కేసీఆర్ తీరు విభిన్నం. జనాల నాడిని పట్టుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని చెబుతారు

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయితీ పరిధిలో శనివారం సాయంత్రం కేసీఆర్ చేసిన ఫోన్ కాల్ సంచలనమైంది. అకస్మాత్తుగా కేసీఆర్ నుంచి కార్యదర్శి రమాదేవికి ఫోన్ రావడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

తేరుకున్న ఆమె కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటిపన్నుల నిర్వహణ.. అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయేత భూమిగా మార్పు తదితర అంశాల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

కాగా ఎనుగల్ అనేది రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్వగ్రామం కావడం విశేషం.
Tags:    

Similar News