బలం అంటే బలవంతంగా లాక్కోవడమేనా!

Update: 2018-09-07 17:30 GMT
బలం అంటే ఏమిటి.......రాజకీయాలలో ఒక పార్టీ బలంగా ఉందంటే అర్దం ఏమిటి.....తమకు నచ్చిన - మెచ్చిన పార్టీలోకి నాయకులుగాని - నేతలుగా తామంతట తామూగా ఆ పార్టీలోకి చేరి - ఆ పార్టీ జండాను కప్పుకోవడం. కాని దీనికి విరుద్దంగా ఉంది  తెలంగాణ రాష్ట్ర సమితీ నాయకుల తీరు. మా వెనుక జనం ఉన్నారు - మాది తెలంగాణలో బలమైన పార్టీ అని ప్రగల్భాలు పలికే తెలంగాణ రాష్ట్ర సమితీ నాయకులు ఇప్పుడు మాజీ కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రగతి నివేదన సభ విజయవంతం కాకపోవడంతో కల్వకుంట్ల వారి గుండేల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ  అపధర్మ  మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు, మాజీ స్పీకర్ - కాంగ్రెస్ నాయకుడు అయిన సురేష్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా తారాక రామారావే తన మందీ మార్భలంతో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తమ పార్టీలోకి రావాలంటూ సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండ మరికొంత మంది కాంగ్రెస్ నాయకులను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించాలని తెరాస అధిష్టనం అనుకుంటున్నట్లు సమాచారం. ముందస్తు ప్రకటించిన మరుసటి రోజే కేటీఆర్ - సురేష్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిని బట్టి కేసీఆర్‌ కు ఓటమి భయం పట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీలా ఉండగా తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు జాబితాను ప్రకటించారు. ముందుగా శాసనసభకు 105 మంది అభ్యర్దులకు టిక్కెట్లు కేటాయించారు. ఇందులో  టిక్కెట్లు ఆశించి - భంగపడ్డ కొంతమంది తెరాస నాయకులు కాంగ్రెస్ తీర్దం పుచ్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిజామబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు - రాజ్యసభ సభ్యడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితీ తన కుటంబాన్ని రోడ్డుకు ఈడ్చిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. డి. శ్రీనివాస్ అనుచర గణం కూడా కాంగ్రెస్‌ లో చేరుదామంటూ వత్తిడి తీసుకుని వస్తున్నారు. అంతేకాకుండా వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ కూడా  కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని  వినికిడి. వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి సురేఖ టిక్కెట్టు ఆశిస్తున్నారు. దీంతో పాటు జిల్లలో మరో రెండు నియోజకవర్గాలలో తన కుటంబానికే టిక్కెట్టు ఇవ్వాలని తేరాస అధినేతను కోరినట్లు తెలిసింది. దీంతో తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్ది పేరు ప్రకటించ లేదు. అధినేత చర్యపై అలిగిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అంతేకాక 2014 తర్వాత కాంగ్రెస్‌ నుంచి టిఆర్ ఎస్‌ లోకి వచ్చిన నాయకులు తిరిగి కాంగ్రెస్‌ లోకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ నేతలు తామంతట తామే వచ్చి చేరుతుంటే, తెలంగాణ రాష్ట్ర సమితీ నాయకులు మాత్రం మా పార్టీలోకి వచ్చి చేరండి ....... అంటూ ఆహ్వనిస్తున్నారని.......దీనిని బట్టి ఎవరు బలవంతులో తెలుస్తోందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రాబోయే నెల రోజులలోపు తెలంగాణలో చాలా రాజకీయ జిమ్మికులు జరిగే అవకాశాలు  ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News