తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నిర్ణయాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. వినూత్నంగా ఉంటాయి. పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని.. మిగిలిన పార్టీలకు భిన్నంగా నిర్వహించేందుకు.. పార్టీ యంత్రాంగంలో భారీ కదలిక తెచ్చేందుకు అప్పుడప్పుడు ఆయన కొత్త తరహా విదానాలకు పిలుపునిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగుతున్న వేళలో.. పార్టీ వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కూలీ పనికి పిలుపునిచ్చి.. ఆ కార్యక్రమాన్ని ఓ వారం పాటు యమా యాక్టివ్ గా నడిపిన కేసీఆర్.. పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని అమలు చేయనున్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. ఇప్పటివరకూ ఎవరూ నిర్వహించనంత భారీగా వరంగల్ లో ఈ నెల 27న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇందుకు 15 లక్షల మందితో జనసమీకరణ జరిపి.. యావత్ తెలంగాణ విస్తుపోయేలా సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ముందే.. హైదరాబాద్ లో ప్లీనరీ ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభను నిర్వహించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు పార్టీ నేతలు.. కార్యకర్తలు కూలీ పని చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
నిదుల సమీకరణకు తాను సైతం కూలీ పని చేస్తానని.. అదే రీతిలో పార్టీకి చెందిన అందరూ ఈ నెల 14 నుంచి 20కి మధ్యలో కనీసం రెండు రోజుల పాటు అయినా కూలీ చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని.. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలకు ఇతర రాష్ట్రాలు అద్యయనం చేసి వెళుతున్నట్లు చెప్పారు. ఆసక్తికరమైన విషయంలో ఏమిటంటే.. పవర్ లో ఉన్న ఒక పార్టీ నిధుల సమీకరణకు కూలీ పని చేసే వినూత్న కార్యక్రమం టీఆర్ ఎస్ కు మాత్రమే సొంతమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన టీఆర్ ఎస్ తొలుత 51.5 లక్షల సభ్యత్వాలు చేసుకుందని.. పవర్ లోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో 75 లక్షలు దాటిపోయిందని.. సభ్యత్వాలకుప్రజల్లో అద్బుతమైన స్పందన ఉందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ రుసుము పెంచినా సభ్యత్వం పెరుగుతోందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. సభ్యత్వ రుసుము కింద పార్టీకి రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్లు సమకూరనుందని.. ఇప్పటికే పార్టీ హెడ్ ఆఫీస్ కు రూ.13.5 కోట్లు అందాయని వెల్లడించారు. మరింత భారీగా ఆదాయం వస్తున్న వేళలోనూ.. నిధుల సమీకరణకు కూలీ కార్యక్రమం ఏమిటో కేసీఆర్ కు మాత్రమే తెలియాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/