సోమవారం బాబుకు కేసీఆర్ పిలుపులు

Update: 2015-12-13 03:49 GMT
ఇద్దరు చంద్రుళ్లు కలుసుకునే టైం ఫిక్స్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత స్థాయిలో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పిలిచేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రుల్ని కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఏపీ సీఎంవోను బాబు అపాయింట్ మెంట్ కోరటం.. వెనువెంటనే స్పందించిన ఏపీ సీఎంవో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయటం జరిగిపోయాయి.

దీంతో.. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చండీయాగానికి పిలిచేందుకు విజయవాడకు వెళుతున్నారు. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వెళ్లటం.. ఈ సందర్భంగా ఏపీ సర్కారు ఆయనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవటం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ సోమవారం విజయవాడలో భేటీ కానున్నారు.

తాజాగా బెజవాడకు వెళుతున్న కేసీఆర్.. తన పర్యటనలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. తిరుమల శ్రీవారిని.. తిరుచానూరు అమ్మవారితో పాటు.. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లిస్తానని పేర్కొనటం తెలిసిందే.
Tags:    

Similar News