తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య నెలకొన్న సరికొత్త ప్రేమాయణం అమరావతి ఎపిసోడ్ తర్వాత కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పుడు ప్రేమ ప్రకటన కేసీఆర్ నుంచి రానుంది. డిసెంబర్ నెలలో హైదరాబాద్ నగర శివార్లలోని ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న చండీయాగానికి హాజరు కావలసిందిగా కేసీఆర్ స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి చండీయాగానికి రావలసిందని ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే.,
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి స్వయంగా తనను ఆహ్వానించిన ఏపీ ముఖ్యమంత్రికి అదేవిధంగా చండీయాగానికి రావలసిందిగా కేసీఆర్ ఆహ్వానం అందజేయనున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అతి పెద్ద పోరాటానికి టీడీపీ - తెరాస పార్టీల కార్యకర్తలు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో, ఈ రెండు పార్టీల అధినేతల మధ్య ఈ కొత్త అనుబంధం ఏమిటో, వారి పరస్పర ఆహ్వానాల కథేమిటో అర్థం కాక ఇరు పార్టీల కార్యకర్తలూ జుత్తు పీక్కుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాన్య ఓటరు వీరి తాజా ప్రేమాయణాన్ని ఎలా అర్థం చేసుకుంటారన్నది క్యాడర్ కు అస్సలు అంతుబట్టడంలేదు.
ఎన్నికలకు ఇలాంటి స్నేహబంధాలకు ముడిపెట్టడం కరెక్టు కాదు గానీ.. వీరికి ఒక ఎడ్వాంటేజీ ఉంది. డిసెంబరు 23నుంచి మహా చండీయాగం జరుగుతుంది. అంతకు బాగా ముందుగా నవంబరులోనే వరంగల్ - నారాయణఖేడ్ ఎన్నికల సమరం ముగిసిపోతుంది.. ఆ తర్వాత ఎప్పటికో ఫిబ్రవరిలో గానీ గ్రేటర్ సమరం ఉండదు. కాబట్టి పరస్పర నిందలు వేసుకోవడానికి మధ్య గ్యాప్ లో కాస్త స్నేహం బాగానే సాగవచ్చు.