అది చిత్తూరు జిల్లా నగరి. ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసం. సందడిగా ఉంది. షామియానాలు, విందు కోసం వంటల తయారీ.. ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరో అతిథి వస్తున్నట్టున్నారు. కానీ ఎవరో తెలియదు. ఆ అతిథికి జన్మలో మరిచిపోని రాయలసీమ ఆతిథ్యాన్ని ఇవ్వడానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా రెడీ అవుతోంది.. ఇంతకీ ఆ అతిథి ఎవరని ఆరాతీస్తే.. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
కేసీఆర్ ఏంటి.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి అతిథిగా రావడమేంటి.? అసలేంటి మ్యాటర్ అని ఆశ్చర్యపోకండి.. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా గుండా వెళుతున్న కేసీఆర్ కు ఏపీ ఆడబిడ్డ వైసీపీ ప్రభుత్వం తరుఫున ఇస్తున్న ఈ తియ్యటి విందు ఇదీ..
కేసీఆర్ ఆదివారం కళాతపస్వి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆ పర్యటనతోనే కేసీఆర్ లోని కళాభిలాష తెలిసి వచ్చింది. ఆయన సినిమాలు చూస్తారని.. శంకరాభరణంను 25 సార్లు చూసారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కళాభిమానమే ఆయనను నిర్మాత మార్చి విశ్వనాథ్ తో సినిమా తీయడానికి ఉసిగొల్పింది.
ఆదివారం కళాతపస్వి విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన కేసీఆర్ సోమవారం తమిళనాడు పర్యటన పెట్టుకున్నారు. మధ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కంచి అత్తి వరదరాజ పెరుమాళ్ లో 40ఏళ్లకు ఒకసారి దర్శన భాగ్యం కలిగించే ఈ అపురూప ఆలయాన్ని ఆయన దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన కంచికి వెళతారు. ఆ తర్వాత తిరుమలకు తిరిగి వచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం రేణిగుంటకు తిరిగివచ్చి హైదరాబాద్ కు తిరిగి పయనమవుతారు.
రేణిగుంట నుంచి కంచికి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి కేసీఆర్ వెళ్లనున్నారు. నగరి.. వైసీపీ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గం. ఈ సందర్భంగా కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకునేందుకు రెడీ అయ్యారు. తిరుగు ప్రయాణంలోనూ భోజనం కూడా రోజా ఇంట్లోనే చేస్తారని ముఖ్యమంత్రివర్గాలు తెలిపాయి. కేసీఆర్ తన ఇంటికి వస్తుండడంతో ఆయన కోసం రోజా ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏర్పాట్లు చేస్తోంది. పలువురు ఏపీ మంత్రులు కేసీఆర్ కు స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు..
అయితే రోజాతో భేటి కేవలం ఆధ్యాత్మిక పర్యటనలో భాగమా లేక.. నిన్నటి దర్శకుడు విశ్వనాథ్ తో సమావేశం కంటినేషనా.? అన్న సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్నాయి. విశ్వనాథ్ తో సినిమా తీస్తానన్న కేసీఆర్.. అందులో రోజా కోసం ఏమైనా ప్రత్యేక పాత్ర రెడీ చేశాడా.? అందుకోసమే రోజా ఇంటికి ప్రత్యేకంగా వెళుతున్నాడా? ఇలాంటి ప్రశ్నలెన్నో కేసీఆర్ పర్యటన సందర్భంగా లేవనెత్తుతున్నారు.. ఇప్పటికైతే వీటిపై క్లారిటీ లేదు. రోజా ఇంటికి కేసీఆర్ విందుకు వస్తున్నదైతే నిజం.. చూడాలి మరి దీనివెనుక అర్థం పరమార్థం ఏంటో..