కేసీఆర్ ఏదీ చేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది. కేసీఆర్ వేసే ప్రతి అడుగులోనూ రాజకీయ ప్రయోజనం ఉంటుంది. అందుకే మంత్రి వర్గాన్ని లేట్ చేసినా.. కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసినా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఢిల్లీ బాధ్యతలు, పనులు చక్కబెట్టేందుకు కేసీఆర్ ఓ బ్రహ్మస్త్రాన్ని రెడీ చేయబోతున్నట్టు సమాచారం. అదెవరో కాదు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ..
రాజీవ్ శర్మ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు. తెలంగాణ తొలి సీఎస్ గా ఆయన కేసీఆర్ కు అండదండలందించారు. గొప్పగా సహకరించారు. అందుకే ఆయన రిటైర్ కాగానే తన సలహాదారుగా కేసీఆర్ నియమించుకున్నారు.
రాజీవ్ శర్మ ఢిల్లీలో - కేంద్ర సర్వీసుల్లో చాలా కాలం పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో కేంద్రమంత్రులు - సీనియర్ అధికారులతో విస్తృత పరిచయాలున్నాయి. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో తొలి సీఎస్ గా చేశారు. అందుకే ఇప్పుడు రాజీవ్ శర్మ పరిచయాలను తెలంగాణకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ స్కెచ్ గీశారు. తద్వారా తెలంగాణ అభివృద్ధికి ఆయన సేవలు వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.
తెలంగాణలోనే విద్యావంతులు ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాజీవ్ శర్మను ఎంపీగా నిలబెట్టేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ గతంలో ఎంపీగా చేసిన మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. పోటీలేని ఈ స్థానంలో రాజీవ్ శర్మను ఎంపీని చేసి ఢిల్లీకి పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో మల్కాజిగిరి నుంచి రాజీవ్ శర్మ గెలుపు సులువే. అక్కడ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ నేతలే కావడంతో ఈజీగా గెలుస్తారు. తద్వారా ఢిల్లీలోనే రాజీవ్ శర్మను ఉంచి తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులు, నిధులు రాబట్టేందుకు ఈ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీయబోతున్నట్టు సమాచారం.
Full View