విషయం ఏదైనా.. పెద్ద మనిషి మాదిరి ప్రతి అంశంపైన స్పందించే ప్రముఖులు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం తమకు తోచిన అంశాల మీదనే స్పందిస్తారు. ఈ రెండూ తప్పేం కాదు. కానీ.. మంట పుట్టే రకం మూడో తీరును ప్రదర్శించేవారు. తమకు ఎక్కడో కాలినప్పుడు.. ఒక్కసారిగా బయటకు వచ్చే.. మాటలతో ఆగమాగం చేసేస్తుంటారు. ఈ సందర్భంగా వారు చెప్పే నీతులు.. వారు నేర్పే విలువలు అన్ని ఇన్ని అన్నట్లుగా ఉండవు.
ఇంతటి సంస్కారవంతుడు.. ఇవాల్టి రోజున దేశానికి ఉండాల్సిందే అన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. కానీ.. ఇదే పెద్ద మనిషి.. ఇప్పుడే వేలెత్తి చూపిస్తున్న వైనాల మీద గతంలో కొందరు వ్యవహరించినప్పుడు కామ్ గా ఎలా ఉండగలిగారు? అన్నది ప్రశ్న మెదులుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే పెద్ద మనిషికి.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద విపరీతమైన ఆగ్రహాన్ని పదర్శిస్తున్నారు. ఆయన మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏ అంశాల్ని లేవనెత్తుతున్నారో.. గతంలో అంతకు మించి అన్నట్లు జరిగినప్పుడు నోరు ఎందుకు మెదపలేదు? ఎందుకు ప్రశ్నించలేదన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.
మోడీ మీద మంట పుట్టటం దేశ ద్రోహం అయితే ఎంత మాత్రం కాదు. ఆయన్ను మాత్రం తప్పు పట్టొద్దని.. వేలెత్తి చూపించొద్దన్న చెత్త మాటలు చెప్పే ఆలోచన లేదు. తప్పులు చేస్తుంటే.. ఆ తప్పుల్ని ప్రశ్నించటం తప్పేం కాదు. కాకుంటే.. ఆ తప్పులతో పాటు.. గతంలోనూ అలాంటి తప్పులు చేస్తున్న వైనం పైనా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయాలి కదా? ఒకసారి కామ్ గా.. మరోసారి చెలరేగిపోవటం సరికాదు కదా? సీఎం కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ ను చూసినప్పుడు ప్రధాని మోడీ మీద చెలరేగిపోతూ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని విన్నప్పుడు మనసు వెంటనే అండర్ లైన్ చేసుకోమని గోల పెట్టేయటం ఖాయం.
అందులో ముఖ్యమైన వ్యాఖ్యను.. "ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ న్యాయమూర్తులకు సెల్యూట్ చేస్తున్నాను. నూపురు శర్మ వ్యాఖ్యలను తప్పుపడితే సుప్రీంకోర్టుపైనా లేఖలు రాయిస్తారా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరిస్తున్నారు.. ఇది కరెక్టేనా..?. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని కండకావరమా బీజేపీ..?. జడ్డీలను కూడా ట్రోలింగ్ చేస్తారా..?" అంటూ మండిపడ్డారు. ఇన్ని మాటలు చెబుతున్న పెద్ద మనిషి.. 2020 అక్టోబరులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాయటం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ లేఖ సారాంశం.. "ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్ వి రమణ ఏపీ హైకోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల హైకోర్టులో జరిగిన పరిణామాలు ఆయన ముందు ఉంచాం" లాంటివి చాలానే వ్యాఖ్యలు చేశారు. ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక అయ్యే కొంతకాలం ముందు ఇలాంటి లేఖ రాయటం.. అనంతరం అత్యున్నత స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులను ఉద్దేశించి జరిగిన ట్రోలింగ్.. చేసిన వ్యాఖ్యల వేళ.. ఇదే కేసీఆర్ ఏమైపోయారు? అన్నది ప్రశ్న.
నిలదీసే అలవాటు ఉన్నప్పుడు సీఎం కేసీఆర్.. తప్పులు జరుగుతున్న ప్రతిసారీ తన గళాన్ని వినిపించాలి కదా? అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో గట్టిగా.. మరికొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ఏమిటి? అన్నది ప్రశ్న. నిజానికి నూపూర్ శర్మ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆమె మాట్లాడిన మాటలకు వెంటనే స్పందించిన మోడీ ప్రభుత్వం.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా సుప్రీం జడ్జిల్ని టార్గెట్ చేస్తున్నారంటూ.. దాన్ని ప్రధాని మోడీకి.. ఆయన ప్రభుత్వానికి ఆపాదించటం ఎంతవరకు సబబు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నీతులు చెప్పే పెద్ద మనిషి.. ఆ పనినైనా రెగ్యులర్ గా చేస్తే ఎలాంటి పంచాయితీ ఉండదన్న విషయాన్ని సీఎం కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.