చేతిలో అధికారం ఉండాలే కానీ.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటానికి ఎవరు మాత్రం అడ్డు చెబుతారు చెప్పండి. ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పదవి నుంచి తీసేసి.. ఆ శాఖను తన వద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంచేసుకోవటం తెలిసిందే. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన మంత్రి ఆ జిల్లాకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారాల్ని చూసుకోవాల్సిందిగా మొన్నామధ్య జరిగిన మంత్రివర్గసమావేశంలో చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా తనకు ప్రత్యేక అధికారిగా నిమ్స్ నెఫ్రాలజీ విభాగానికి అధిపతి.. సీనియర్ ప్రొఫెసర్ గంగాధర్ ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తేల్చారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ కార్యాలయంలోప్రత్యేక అధికారులుగా ప్రియాంక.. శ్రీధర్ దేశ్ పాండే.. దేశపతి శ్రీనివాస్ లు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. వీరికి తోడుగా తాజాగా నిమ్స్ ప్రొఫెసర్ గంగాధర్ ను ఎంపిక చేయటంతో ఈ సంఖ్య మొత్తం నాలుగుకు చేరినట్లైంది.
ముఖ్యమంత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఉండటం.. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రముఖుడు ఉంటే మరింత బాగుంటుందన్న ఉద్దేశంతోనే గంగాధర్ ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కరోనా టాస్క్ ఫోర్సు కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన్ను.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల ఆయన్ను ఎంపిక చేసింది.