రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ తో ఖాళీ అయ్యే స్థానాల్ని కలుపుకుంటే తెలంగాణలో మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి బండ ప్రకాశ్ ను ఇప్పటికే రాజీనామా చేయించిన కారణంగా ఆ స్థానం ఖాళీగా ఉంది.
మరో రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. మరో స్థానంలో డీఎస్ పదవిలో ఉన్నారు. కెప్టెన్ ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చే వీల్లేదు. ఇక.. డీఎస్ విషయానికి వస్తే.. ఆయన పార్టీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే మూడు స్థానాల్లో ఒక్క స్థానానికి సంబంధించి మాత్రమే అభ్యర్థి పేరును ప్రకటిస్తారని. మిగిలిన ఇద్దరు పేర్లను తర్వాత ప్రకటిస్తారని చెబుతున్నారు. మరి.. కేసీఆర్ ప్రకటించే ఆ ఒక్కరు ఎవరంటే.. టీఆర్ఎస్ సీనియర్ నేత.. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లోక్ సభ సభ్యుడిగా సుపరిచితులు.. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన నిర్ణయాన్ని గులాబీ బాస్ తీసుకున్నారని.. అధికారికంగా ప్రకటించటం మాత్రమే మిగిలి ఉందంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకుతగ్గట్లే బోయినపల్లి వినోద్ కు అవకాశం ఇస్తే..జాతీయ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు పార్టీకి మేలు చేస్తాయన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా వ్యవహరించే ఆయన.. ఢిల్లీ వ్యవహారాల్ని కూడా చక్కబెట్టటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పేరు ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని మాత్రం దళితులకుకేటాయిస్తారని.. అది కూడా విషయాల మీద పట్టు.. చక్కగా మాట్లాడే వారికి అప్పజెప్పటం ద్వారా జాతీయ రాజకీయాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి గళం విప్పే సత్తా ఉన్న వారిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు.
మూడో అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం పలు పేర్లుతెర మీదకు వచ్చినా.. ఫైనల్ అయ్యే పేరు విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. మరికొంత కాలంలో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.