40 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..ఇద్ద‌రిలో పైచేయెవ‌రిదో?

Update: 2018-08-29 16:03 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ను ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై న‌వ్యాంధ్ర ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌నానంత‌రం ఏపీలో కాంగ్రెస్ ఐసీయూలో చేరిన‌ట్ల‌యింది. అయితే, 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కొద్దిగా పుంజుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఏపీలో బ‌లంగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అవ‌స‌ర‌మైతే టీడీపీతో పొత్తుపెట్టుకుని వైసీపీని ఎదుర్కోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ - కాంగ్రెస్ ల పొత్తు ఇరు పార్టీల నేత‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. క‌ర్నూలు జిల్లాలోని ఇద్ద‌రు సీనియ‌ర్ పొలిటిషిన్ల‌ను ఆ పొత్తు క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ తాజా పొత్తు పుకార్ల వ్య‌వ‌హారంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయ్. పొత్తు సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ....టీడీపీ - కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య  మాట‌ల తూటాలు పేలుతున్నాయ్. 40 ఏళ్లుగా క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా కొన‌సాగుతోన్న ఏపీ డిప్ప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డిల‌కు ఈ పొత్తు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది.

క‌ర్నూలులో ఈ ఇరు వ‌ర్గాల మ‌ధ్య 40 ఏళ్లుగా ప‌గా ప్ర‌తీకారాలు - ఆధిప‌త్య పోరు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.  ఈ క్ర‌మంలోనే ఒక‌వేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనివార్య‌మైతే....కోట్ల‌కు కేఈ మ‌ద్ద‌తు తెల‌పాల్సిన ప‌రిస్థితి అనివార్య‌మ‌వుతుంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ త‌మ పార్టీ వ్య‌వ‌హారాల్లో తిరుగులేని నేత‌లుగా చెలామ‌ణీ అవుతోన్న వీరిద్ద‌రు ఒక‌రికొక‌రు సాయం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డే అవకాశ‌ముంది. ముఖ్యంగా డోన్ లో ఈ ఇద్ద‌రికీ అనుచ‌ర గ‌ణం ఎక్కువ‌. ఒక‌వేళ‌ పొత్తు కుదిరితే డోన్ తో పాటు క‌ర్నూలు ఎంపీ సీటు త‌మ‌కే కావాల‌ని కోట్ల వ‌ర్గం ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా. అదే జ‌రిగితే....డోన్ - క‌ర్నూలులలో కోట్ల‌కు కేఈ వ‌ర్గం మ‌ద్దతు తెల‌పాలి. వీరిద్ద‌రికి మ‌ధ్య ఉన్న వైరం కార‌ణంగా అది సాధ్యం కాక‌పోవ‌చ్చని టాక్. మ‌రి, ఈ క్ర‌మంలో ఆ పొత్తుల వ్య‌వ‌హారం వ‌ర్క‌వుట్ అవుతుందా కాదా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే...కేఈ - కోట్ల వ‌ర్గాల మ‌ధ్య మాత్రం అల‌జడి రేగుతోంద‌ట‌.

Tags:    

Similar News