ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీపీఎంలో సీనియర్ లీడర్ కూడా. మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా కూడా మళ్లీ రెండోసారి సీఎం అవకాశం అందుకోలేకపోయారు. ఈసరికే అర్థమై ఉంటుంది.. ఆయనెవరన్నది. ఇంకెవరో కాదు.. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించినా కూడా అచ్యుతానందన్ కు అవకాశం రాలేదు. దాంతో ఆ మాజీ సీఎం ఇప్పుడు రాజకీయంగా ఖాళీగా ఉన్నారు. దీంతో ఓ మలయాళ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట.
సామాజిక సమస్యలపై జీవన్ దాస్ అనే దర్శకుడు తీస్తున్న మళయాల సినిమాలో ఆయన నటించనున్నారు. ఈ మేరకు దర్శకుడి కోరికను ఆయన అంగీకరించారట. అనేక పోరాటాల్లో పాల్గొని, వేలాది సమావేశాల్లో మాట్లాడిన అచ్యుతానందన్ సీపీఎం సీనియర్ నేతగా ఎన్నో సమస్యలపై పోరాడారు. అందుకే ఆ పాత్రకు ఆయనైతేనే కరెక్టుగా సరిపోతారని అంటున్నారు. ఈ సినిమా అచ్యుతానందన్ ది కీలక పాత్రంట.
కాగా అచ్యుతానందన్ తమ సినిమాలో నటించనుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని దర్శకుడు జీవన్ దాస్ చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొంతవరకు పూర్తయిన ఈ సినిమా సెప్టెంబరులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.