లెఫ్ట్ పార్టీ పరిపాలనలో ఉన్న కేరళలో వివాదాస్పదంగా మారిన లవ్ జిహాద్ ఉదంతాల్లో కొత్త పరిణామం తెరమీదకు వచ్చింది. మాటలతో ఏమార్చి...అనంతరం శారీరకంగా లొంగదీసుకొని...మతం మార్పించి పెళ్లి చేసుకొని...ఆపై అంతర్జాతీయ రాక్షస ముఠా ఐసిస్ కు అమ్మేసేందుకు సిద్ధమైపోయారు. ఈ షాకింగ్ పరిణామం కలకలం మారింది.
ఓ యువతిని మత మార్పిడికి బలవంతం చేయడంతో పాటు - ఆమెను సెక్స్ బానిసగా ఇస్లామిక్ ఉగ్రవాదులకు అమ్మేందుకు యత్నించారన్న ఆరోపణలతో కేరళ పోలీసులు కోచి సమీపంలోని ఉత్తర పరవూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అసలు సూత్రధారి అయిన ఆమె భర్త కోసం పోలీసులు ఇంటర్ పోల్ సాయంతో గాలిస్తున్నారు. ఫవాజ్ - మహ్మద్ సియాద్ లుగా వీరిద్దరినీ గుర్తించామని - ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎర్నాకుళం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఉత్తర కేరళకు చెందిన 24 ఏళ్ల ఆ యువతి తన భర్త మహ్మద్ రియాజ్ (26) తనను సిరియాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు విక్రయించేందుకు యత్నించాడని ఆరోపించింది. సౌదీ అరేబియాకు తనను తీసుకెళ్లే ముందు పరవూర్ లోని ఓ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లిన తనను మత మార్పిడి చేసుకోవాలని బలవంతం చేశాడని, తన భర్త ఆదేశాలతో మరో ఇద్దరు తనను హింసించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సౌదీ అరేబియాలో తనను ఓ గదిలో బంధించారని - అయితే తాను ఓ మొబైల్ ఫోన్ ద్వారా తల్లిదండ్రుల సమాచారాన్ని అందించానని - ఎన్ ఆర్ ఐల సహాయంతో తప్పించుకుని వచ్చానని చెప్పారు.
కాగా, కొద్దికాలం క్రితమే సరిగ్గా ఇలాంటి ఉదంతమే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ లో పుట్టి పెరిగి కేరళలో నివసిస్తున్న ఓ మహిళను ఓ కేరళ వాసి ఇలా మోసం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయనకు సంబంధం ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) నిఘా పెట్టింది. తాజా ఉదంతం తెరమీదకు రావడంతో ఈ సంస్థ కార్యకలాపాలపై ఆరాతీస్తోంది. కాగా, ప్రేమ పేరుతో కేరళలో ముస్లిం యువత జరుపుతున్న వివాహాల్లో కుట్ర కోణం ఉందనే తమ ఆరోపణ నిజమైందని ఆ రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.