కిమ్ పదవి ఊడిపోబోతుందా..రేసులో ఉన్న ఇద్దరు ఎవరంటే?

Update: 2020-06-09 14:30 GMT
కిమ్ జాంగ్ ఉన్ ..ప్రపంచ పరిజ్ఙానం గురించి తెలిసినవారెవరికైనా కూడా ఈ పేరు , ఈ పేరు గల మనిషి గురించి బాగా తెలిసేవుంటుంది. ఆధునిక ప్రపంచ నియంతగా కిమ్ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నాడు. అగ్రరాజ్యం గా పిలువబడే అమెరికాకి సైతం ముచ్చెమటలు పట్టించాడు. భూమి జానడు ఉన్నా కూడా కిమ్ బుర్ర మాత్రం రాకెట్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే 2020లోవచ్చిన ఈ వైరస్ కంటే ఎక్కువ కిమ్ ఎక్కువ సంచలనం అయ్యారని చెప్పాలి. ఈయన చనిపోయారంటూ అనేక రూమర్స్ ప్రపంచ మీడియాలో ఏప్రిల్, మే నెలల్లో హాల్చల్‌ చేశాయి. అయితే , ఆ తరువాత మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చి ...నేను ఇంకా పోలేదు అని సాటిచెప్పాడు.

అయితే, ప్రస్తుతం కిమ్‌కు నాయకత్వ భయాల ఎక్కువగా పట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో నార్త్ కొరియా ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. చైనా నుంచి రావాల్సిన ఫండింగ్ కూడా ఆగిపోయింది. దీనితో ఆ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడ మాత్రం ఇప్పటివరకు ఒక్క వైరస్ కేసు కూడా నమోదైనట్లు అధికారికంగా వార్తలు రాలేదు. అక్కడ వైరస్ ఉండేది లేనిది వారికీ తప్ప ఇంకెవరికి తెలియదు.

ఈ తరుణంలోనే తాజాగా డైలీ ఎన్‌కే కిమ్ జాంగ్ ఉన్ గురించి ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. త్వరలోనే కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా తప్పుకోనున్నట్లు .. అధ్యక్ష పదవి రేస్‌లో ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారట. వారిలో ఒకరు రికనైసెన్స్ జనరల్ బ్యూరో అధిపతి రిమ్ గ్వాంగ్-ఇల్ కాగా, మరొకరు సుప్రీం గార్డ్ కమాండ్ హెడ్ గ్వాక్ చాంగ్-సిక్. ఉత్తర కొరియాలో సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. రిమ్ గ్వాంగ్-ఇల్ వ్యూహాత్మక కార్యకలాపాలలో నిపుణుడని.. అలాగే గ్వాక్ చాంగ్-సిక్ చాలా తెలివైనవాడని తెలుస్తోంది. గతంలో ఆర్‌జీబీకి హెడ్‌గా వ్యవరించిన జాంగ్ గిల్ సాంగ్ సౌత్ కొరియాపై ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. అది కాస్తా ఫెయిల్ అయింది. దీనితో వెంటనే అతడి స్థానంలో రిమ్ గ్వాంగ్-ఇల్‌ను నియమించారు.దేశ ఆర్థిక వ్యవస్థ ను కిమ్ గాడిలో పెట్టకపోతే ..ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని నార్త్ కొరియా వర్కర్స్ పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది.
Tags:    

Similar News