మాజీ ప్రేయ‌సికి కీల‌క ప‌ద‌వినిచ్చిన కిమ్‌

Update: 2017-10-11 08:46 GMT
అస‌లే కిమ్. ఆపై చేతిలో అధికారం. ఇంకేం ఉంటుంది.. మ‌నోడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా అడిగే నాథుడే లేని ప‌రిస్థితి. కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. కిమ్ అంటే వ‌ణికి చ‌స్తారే కానీ.. నోరెత్తి హ‌క్కుల కోసం గొంతు విప్పే ధైర్యం చేయ‌రు. ఒక‌వేళ చేస్తే.. ఎంత‌టి వారైనా వారి ప‌ని పూర్తి అయిన‌ట్లే. ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికాకే త‌న చేత‌ల‌తో చుక్క‌లు చూపిస్తున్న కిమ్ లాంటి మొండోడి తీరు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ న్యూస్ గానే చెప్పాలి.

ఇటీవ‌ల కాలంలో తాను సుప్రీం అయిన అధికార‌పార్టీలో భారీగా మార్పులు చేస్తున్న కిమ్‌.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ అమెరికా మీద నిప్పులు చెరిగిన ఆయ‌న‌.. ఇటీవ‌ల కాలంలో పార్టీ మీద ఫోక‌స్ మ‌రింత పెంచారు. తాజాగా త‌న మాజీ ప్రేయ‌సికి అధికార పార్టీలో కీల‌క ప‌ద‌విని అప్ప‌జెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.

మొద‌ట‌ల్లో ఫీమేల్ పాప్ బ్యాండ్ కు లీడ్ చేసిన హ్యోన్ సాంగ్ వోల్ ను చూసిన కిమ్ ఆమె ప్రేమ‌లో ప‌డ్డాడు. త‌ర్వాతి కాలంలో ఆమెకు దూర‌మ‌య్యాడు. అయితే.. హ్యోన్ గ‌తంలో మోరాన్ బాగ్ ప‌ట్ట‌ణానికి నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. ఇంత‌వ‌ర‌కూ ఆమెకు కీల‌క ప‌ద‌విని ఇవ్వ‌ని ఆయ‌న తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ప్ర‌మోట్ చేశారు. తాజాగా ఆమెను ఉత్త‌ర‌కొరియా అధికార వ‌ర్క‌ర్స్ పార్టీ కేంద్ర క‌మిటీలో కుర్చోబెట్టారు. మ‌రి.. ఇంట్లో ఉన్న భార్యామ‌ణి సంగ‌తేమిటంటారా?  కిమ్ లాంటోడు ఏం చేసినా.. చూస్తూనే ఉండాలే త‌ప్ప నోరు తెరిచి మాట్లాడే ధైర్యం భార్య‌కే కాదు.. ఆ దేశంలో ఇంకెవ‌రికి లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు మ‌రి.
Tags:    

Similar News