జగనా..? మంత్రి పదవా.? అంటే నాని ఏమన్నాడంటే?

Update: 2019-06-10 07:57 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆయన.. మాస్ లీడర్ గా పేరొందారు.. అందుకే జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నాడు. వైసీపీ అంటే ప్రాణంగా భావించి టీడీపీతో యుద్ధం చేసిన వైసీపీ నేత  కొడాలి నాని చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే జగన్ అధికారంలోకి రాగానే నానికి కీలకమైన పౌరసరఫరాల శాఖను ఇచ్చి మంత్రి పదవి అప్పగించారు.

ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నాని తనకు పదవి అప్పగింతపై సంచలన కామెంట్స్ చేశారు. నాకు పదవి ముఖ్యం కాదని.. ఒకవేళ జగన్ ఆదేశిస్తే ప్రజల కోసం ఆయన కోసం మంత్రి పదవి నుంచి తప్పుకొని పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో వైసీపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టడానికి మంత్రి పదవిని వదులు కోవడానికైనా సిద్ధమని సంచలన  ప్రకటించారు.

మంత్రి పదవి తనకు రావడంతో బరువు - బాధ్యత పెరిగాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశించిన ఫలితాన్ని చూపగలనో లేదో అన్న ఆందోళన అయితే ఉందన్నారు. అయితే శక్తివంచన లేకుండా కృషి చేస్తానని.. ప్రగతి సాధిస్తానని అన్నారు.

రేషన్ సరుకులను సక్రమంగా పేదలకు అందేలా చేయడమే తన కర్తవ్యమని పౌరసరఫరాల శాఖ మంత్రిగా అది తన బాధ్యత అని కొడాలి నాని అన్నారు. ధాన్యం కొనుగోలు - రీసైక్లింగ్ - రిటైల్ హోల్ సెల్ - మార్కెట్ ను నియంత్రించి బ్లాక్ మార్కెట్ లేకుండా వ్యవస్థ తెస్తానని నాని హామీ ఇచ్చారు.

   

Tags:    

Similar News