తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకి వెళ్లనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా డిక్లరేషన్ పై రచ్చ రచ్చ జరుగుతుంది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీడీపీ , బీజేపీ నేతలు చెప్తున్నారు. అలాగే సతీసమేతంగా జగన్ మోహన్ రెడ్డి ఎందుకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ , బీజేపీ పై , అలాగే ప్రధాని మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ సతీసమేతంగా ఆలయాలకు వెళ్లాలని చెప్పాలని బీజేపీ నేతలకు మంత్రి కొడాలి నాని సూచించారు. బుధవారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమలలో మీడియాతో మాట్లాడారు. అయోధ్యతో పాటు ఇతర దేవాలయాలకు భార్యను తీసుకెళ్లి పూజలు చేయాలని మోడీకి చెప్పాలని బీజేపీ నేతలకు ఆయన చూసించారు. మోడీ చేస్తున్న కార్యక్రమాలతో ఆయనను విమర్శించేందుకు ఎవరూ కూడ ముందుకు రారన్నారు. కానీ, కింద స్థాయి నాయకుల వైఖరితో మోదీని విమర్శించాల్సి వస్తుంది అని అన్నారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన... స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు.
తిరుమల వెంకన్నను కూడ చంద్రబాబునాయుడు రాజకీయంగా వాడుకొన్నారని ఆయన మండిపడ్డారు. శ్రీవారి దయవల్లే జగన్ సీఎం అయ్యారని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. రాజకీయ ఉద్దేశ్యాలతో వివాదాలు సాగుతున్నాయన్నారు. తిరుమల ఆలయం టీడీపీ, బీజేపీలకు చెందింది కాదన్నారు.