తెలంగాణ‌ను కాపాడుకోవాలి...పార్టీ పెట్టేస్తున్నా

Update: 2018-02-04 15:30 GMT
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లు ఉద్య‌మ‌కారుడిగా త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించిన కోదండ‌రాం...త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాజాగా జ‌రిగిన జేఏసీ స‌మావేశంలో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వస్తే మనోడే కుర్చీలో  కూర్చుంటాడు అని భావించామ‌ని కోదండరాం అన్నారు. అయితే ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌న్నారు. `జయశంకర్ సార్ చెప్పినట్టు వచ్చిన తెలంగాణ కాపాడుకోవాలి. జేఏసీ పార్టీ పెట్టాలనే మీ నిర్ణయాన్ని మన్నిస్తున్న` అంటూ జేఏసీ పార్టీకి కోదండరాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

`మనం ఇంకా గట్టిగా కొట్లాడాలి.  ప్రభుత్వ విధానాలపై యువత పెద్ద ఎత్తున ప్రశ్నించాలి` అంటూ త‌న కార్యాచ‌ర‌ణ‌ను కోదండ‌రాం తెలియ‌జెప్పారు.. రైతుల సమస్యలపై అనేక సార్లు ముఖ్యమంత్రికి - వ్యవసాయ శాఖ మంత్రి కి చెప్పాము. రైతు సమన్వయ సంఘాలపై కోర్ట్ కూడా స్పందించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు  అందరికి తిండి పెట్టి.. వారు బ్రతుకలేని పరిస్థితి వచ్చింది. మార్కెట్‌ లలో రైతు అవమానాల పాలు అవుతున్నారు. రైతుకు సమాధానం చెప్పి - సంతృప్తి చేసే వారు ఎవరు లేరు.` అని వ్యాఖ్యానించారు. `దళారులు  మధ్యవర్తిత్వం లేకుండా చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది. రైతు మార్కెట్ లో దోపిడీకి గురి అవుతున్నాడు. గద్వాలలో ఉన్న విత్తనాల కంపెని వాళ్లు కోట్లకు పడగలెత్తితే రైతులు మాత్రం దుర్బరంగా ఉన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దళారుల పక్షాన ఉంటుందా...లేక రైతుల పక్షాన ఉంటుందా స్పష్టం చేయాలి.` అని కోదండ‌రాం డిమాండ్ చేశారు. రైతు సమస్యల పై ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా స్పందించలేదని ఆక్షేపించారు.

రైతులను ఆదుకోవడానికి సర్కారు సిద్దంగా లేదని కోదండ‌రాం మండిప‌డ్డారు. `నకిలీ విత్తనాలను అరికట్టాలి. దానికోసం చట్టం తేవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతులపై ప్రత్యేక పాలసీ తేవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఓ పార్టీ కావాలి. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కోరుకోలేదు. ఉద్యమకారులను గౌరవించుకోవడానికి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాము. జేఏసీ రాజకీయ పార్టీగా పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అనివార్యంగా పార్టీ పెట్టాల్సి వస్తోంది. రాజకీయాల్లో మేము జోక్యం చేసుకోం. జేఏసీ యథావిధిగా కొనసాగుతుంది.` అని స్ప‌ష్టం చేశారు. `డబ్బున్న వాల్లే రాజకీయాల్లోకి వస్తున్నారు వచ్చి డబ్బు సంపాదించుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిద్దాం..మండలల్లో ధర్నాలు..రోడ్ల మీద వంటా వార్పులు చేద్దాం.. చివరకు హైదరాబాద్ చేరి మన గొంతు వినిపిద్దాం` అని కోదండ‌రాం క్లారిటీ ఇచ్చారు.

`పార్టీతో పాటు జేఏసీ నడుస్తుంది.. అందులో అనుమానం అక్కర్లేదు. పోరాడితే పొయ్యేది ఏమి లేదు..ఇక మోహమాటం లేవు..ఇది తేల్చుకోవాల్సిన సమయం.. పోరాటం తెలుసు. రాజకీయం తెలుసు అని నిరూపిద్దాం. రాజకీయాలు చేయడానికి సిగ్గు పడం. రాజకీయాలు చేయడం మనకు వచ్చని నిరూపిద్దాం` అని కోదండరాం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News