కాలం చెల్లిన ఐడియాలా కోదండం మాష్టారు?

Update: 2018-03-26 05:15 GMT
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు కోదండం మాష్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించిన కోదండ‌రాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా ఎలాంటి ప‌ద‌వులు తీసుకోకుండా టీజేఏసీకి ప‌రిమితం కావ‌టం తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై ఇప్ప‌టికే త‌న వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేసి.. సొంత రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న కోదండ‌రాం.. త‌న పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలో దిగే వారు ఎవ‌ర‌న్న విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కోదండం మాష్టారు.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించి.. క్రియాశీల‌కంగా ప‌ని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని  నిర్ణ‌యించిన‌ట్లుగా కోదండం మాష్టారు వెల్ల‌డించారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయంతో పాటు.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఏర్పాటు చేసే త‌మ పార్టీలో ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించే ప‌ని లేద‌ని కోదండం స్ప‌ష్టం చేశారు.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి పార్టీలో అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికే చేరిక‌లు మొద‌ల‌య్యాయ‌ని..పార్టీలో చేరే వారి గురించి పూర్తి స‌మాచారం సేక‌రించిన త‌ర్వాతే వారిని పార్టీలోకి ఆహ్వానించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు.. నేత‌లు పార్టీలో చేరే అవ‌కావం ఉంద‌ని తెలుస్తోంది. ఆప‌ర్టీ ఆవిర్భావ స‌న్నాహ‌క క‌మిటీలో ఏప్రిల్ 14న స‌భ‌ను నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న‌పై కోదంరాం సానుకూలంగా స్పందించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. కోదండం మాష్టారి ప్ర‌క‌ట‌న‌పై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ లాంటి బాహుబ‌లిని ఎదుర్కోవ‌టానికి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన వారికి టికెట్లు ఇవ్వ‌టం ద్వారా ఎలాంటి ప‌లితం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా ప‌ని చేసిన‌ప్ప‌టికీ..ప్ర‌త్య‌క్ష ఎన్నికల వేళ‌.. అందునా టీఆర్ఎస్ లాంటి అధికార ప‌క్షంతో ముఖాముఖి పోరుకు త‌ల‌పడిన‌ప్పుడు బ‌లం స‌రిపోద‌ని చెబుతున్నారు. అధికార‌మే ల‌క్ష్యంగా కోదండ‌రాం పార్టీ ఏర్పాటు చేస్తుంటే మాత్రం మాష్టారు త‌న వ్యూహాన్ని వెంట‌నే మార్చాల‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

అలా కాని ప‌క్షంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేర‌న్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయంగా రాజ‌కీయాలు చేయాలంటే సామాన్య‌మైన విష‌యం కాద‌ని.. కోదండం మాష్టారి ఐడియాలు కాలం చెల్లిన‌రీతిలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News