దాదాపు సగం పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే - ఈ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి పార్టీ అడ్రస్ లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం రుచి చూసి అగ్గిపెట్టె గుర్తు పార్టీ ఇప్పుడు పంచాయతీ పోరులో పత్తా లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికార టీఆర్ ఎస్ పార్టీ వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ఉద్యమ నేపథ్యమే అండగా తెలంగాణ జనసమితిని కోదండరాం ఏర్పాటు చేశారు. ఒంటరిగా పోటీ చేస్తామన్న కోదండరాం అనంతరం కాంగ్రెస్-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జట్టుకట్టారు. పొత్తులో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగింది. వీటిలో నాలుగు అంబర్ పేట (నిజ్జన రమేష్) - మల్కాజిగిరి (దిలీప్ కుమార్) - సిద్దిపేట (భవానీ రెడ్డి) - వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ - మిగిలిన ఐదు దుబ్బాక (రాజ్ కుమార్) - వరంగల్ తూర్పు (గాదె ఇన్నయ్య) - ఆసిఫాబాద్ (ఆత్రంసక్కు) - మిర్యాలగూడ (విద్యాధర్ రెడ్డి) - మహబూబ్ నగర్ (రాజేందర్ రెడ్డి) స్థానాల్లో కాంగ్రెస్‌తో కలిసి `స్నేహపూర్వక` పోటీలో నిలిచింది. ఈ పోటీ దశలోనే రకరకాల చర్చలు వినిపించాయి. ఎనిమిది స్థానాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని టీజేఎస్ నేతలే వాపోయారు. తాము 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే నాలుగింటిలో సొంతంగానూ - మిగిలిన ఐదింటిలో కాంగ్రెస్ తో కలిసి స్నేహపూర్వక బరిలో నిలవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ తమను మోసిం చేసిందని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శించారు.
తీరా ఫలితాలు వచ్చిన సమయంలో అగ్గిపెట్టె గుర్తు పార్టీ గల్లంతు అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందారు. ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చూపకలేకపోయారు. పోరాడి - కొట్లాడి మరీ 8 సీట్లు దక్కించుకున్నా.. ఏ స్థానంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మూడు - నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ కీలక నేత రచనారెడ్డి ఇప్పటికే బయటకు రావటం జరిగింది. కూటమి మాయలో మాస్టారు ఉన్నారని బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. అయితే, తెలంగాణ జన సమితి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటనుందని కోడందరాం మాస్టారు ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం కోదండరాం పార్టీ ఆఫీస్ వెలవెలబోయింది. కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోవటంపై ఆ పార్టీలోనే అంతర్మథనం ప్రారంభం అయ్యింది.