కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు - దూకుడుగా ప్రవర్తించే నాయకుల జాబితాలో ముందుండే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు ఆసక్తికరమైన వార్తలతో తెరమీదకు వచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేస్తున్నారని - ఆమె చెల్లిని గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. కొద్దికాలం క్రితం ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇదే రీతిలో సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోనే ఆయన ఓటమిపాలు కానున్నారని జోస్యం చెప్పారు. అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్ను ఓడిస్తానని శపథం చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా - పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు ఉందనేది కాదనలేని నిజం. అయితే, ఆ దూకుడే ఆయనకు బలం,బలహీనతగా మారుతోందని అంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ పార్టీలో చేరిపోతుండటం...మరోవైపు అంతర్గత కుమ్ములాటలు - క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే వ్యూహాలతో ముందుకు సాగకపోవడంతో...`వచ్చే ఎన్నికల్లో అయినా అధికారం దక్కుతుందా?` అనే అనుమానాలు ఆ పార్టీనేతల్లోనే ఉన్నాయనేది కాదనలేని నిజం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఆసక్తికరమైన సవాళ్లు విసురుతుండటం చిత్రంగా ఉందని పలువురు అంటున్నారు. ఎవరు గెలుస్తారు..ఎన్నిసీట్లలో గెలుస్తారు అనే తొడగొట్టడం అంశాలను పక్కనపెట్టి ముందు పార్టీ నేతలకు భవిష్యత్ పై భరోసా కల్పించాలని చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ నేతల్లో స్థైర్యం నింపిన తర్వాతే... బలంగా ఉన్న అధికార పార్టీకి చాలెంజ్ చేయటం ఉత్తమమని చర్చించుకుంటున్నారు.