సొంత పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఇమేజ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తిరుగులేని అధిక్యతతో పాటు.. రాజకీయ సవాళ్లకు స్పందించే దమ్మున్న నేతగా భువనగిరి ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరుంది. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న కోమటిరెడ్డి తన సత్తా ఏమిటో చెప్పకనే చెప్పేశారు.
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో తన గెలుపును దివంగత మహానేత వైఎస్.. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఖాతాలో వేయటం ఆసక్తికరంగా మారింది. తన విజయానికి స్ఫూర్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై పోరాడిన వైఎస్ తో పాటు.. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడతానని చెప్పారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఉరుకోమని తేల్చేశారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళతానంటూ టీఆర్ ఎస్ కు వార్నింగ్ ఇచ్చేశారు. చూస్తుంటే.. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కోమటిరెడ్డిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయన పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారంపై స్పందించారు. తనకు ఎలాంటి పదవి మీద ఆశ లేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర విభజన నాటి నుంచి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన పొన్నాల మొదలు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ వరకూ ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తున్న ఆయన.. ఆ పదవిని చేపట్టాలన్న ఆశలో ఉన్నారు. కానీ.. ఆయన కోరికను అధినాయకత్వం మన్నించని పరిస్థితి. తాజాగా ఎంపీగా గెలిచి మరోసారి తన సత్తాను చాటిన కోమటిరెడ్డి కోరికను ఈసారైనా పార్టీ మన్నిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.