ఏపీ ముఖ్యమంత్రికి వరుసకు సోదరుడు అయ్యే కొండారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేయటం.. ఆయన్ను రిమాండ్ కు తరలించటం తెలిసిందే. ఇదే పెద్ద షాక్ అనుకుంటే.. దీనికి మించి తాజాగా జిల్లా కలెక్టర్.. ఎస్పీలు కలిసి ఆయనపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించటం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడే కాదు.. దగ్గర బంధువు అయిన కొండారెడ్డి మీద ఇంతలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న మాట వినిపిస్తోంది. బయటకు వచ్చిన కారణం కంటే కూడా తెర వెనుక జరిగిన కొన్ని పరిణామాలే తాజాగా చోటు చేసుకున్న అరెస్టు కానీ.. జిల్లాబహిష్కరణకు కానీ కారణంగా చెబుతున్నారు.
చాగలమర్రి - రాయచోటి రోడ్డు పనుల్ని చేస్తున్న కర్ణాటకకు చెందిన బీజేపీకి నేతకు చెందిన ఎస్ఆర్కే నిర్మాణ సంస్థకు కాంటాక్టు లభించింది. తాను ఉన్న ఊర్లో రోడ్లు నిర్మించాలంటే తనకు కప్పం చెల్లించాలనే డిమాండ్ ను కొండారెడ్డి తీసుకురావటం.. ఆ వెంటనే సదరు నిర్మాణ సంస్థకు చెందిన కర్ణాటక బీజేపీ నేత వెంటనే లైన్లోకి వెళ్లటం.. సీఎం జగన్ కు దీనిపై వచ్చిన సమాచారంతో ఆయన చర్యలకు ఉపక్రమించారని చెబుతారు.
తన సన్నిహితుల్ని కాపాడుకునేందుకు ఎంతవరకు అయినా వెళ్లే అలవాటు ఉన్న జగన్.. ఒకప్పుడు తమ ఎస్టేట్ ను చూసుకునే కొండారెడ్డిని అరెస్టు చేయించే వరకుఎందుకు వెళ్లారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడే కొత్త వాదన పురుడు పోసుకుంది. ఈ ఎపిసోడ్ ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. అదేమంటే.. తనకు ఏ మాత్రం నచ్చని రీతిలో సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటం.. ఒక ఎత్తు అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆమె చేస్తున్న పాదయాత్ర వెనుక కూడా షర్మిలకు కొండారెడ్డి సహాయ సహకారాలు అందించటం కూడా ఒక కారణమని చెబుతున్నారు.
ఎక్కడో స్విచ్ వేస్తే.. మరెక్కడో బల్బు వెలిగినట్లుగా వైఎస్ కొండా రెడ్డి అరెస్టు వెనుక చాలానే జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదే కొండారెడ్డిగతంలో ఇడుపుల పాయ ఎస్టేట్ ఇన్ ఛార్జిగా పని చేయటంతో పాటు.. జగన్ కడపకు వస్తే అన్నీ తానై చేసుకోవటం అలవాటుగా చెబుతారు.
ఇలా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కొండారెడ్డి.. సీఎం జగన్ సోదరికి అండగా నిలవటం కథను మరో మలుపులిప్పే.. తెలంగాణలో చేస్తున్న పాదయాత్రకు తన వంతుగా చేయాల్సింది చేస్తున్న కొండా రెడ్డి తీరుపై జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కారణంతోనే అరెస్టుతో పాటు.. కడప జిల్లా బహిష్కరణ వేటు ద్వారా.. కొండారెడ్డిని జీరో చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. కొండారెడ్డి అరెస్టు ద్వారా తనకు ఎంత సన్నిహితంగా ఉన్నా.. తప్పులు చేసే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవన్న సంకేతాన్ని ఇవ్వటంతో పాటు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. అదేమంటే తమకు సీఎం జగన్ అండ ఉందన్న బడాయి మాటలు చెప్పే వారికి గట్టి షాకిచ్చే క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా చెల్లికి అండగా ఉన్న కొండారెడ్డిని ఒకచూపు చూడటం ద్వారా తాను ఇవ్వాల్సిన సంకేతాల్ని విజయవంతంగా ఇచ్చినట్లైందన్న మాట వినిపిస్తోంది.