మెట్రో సేవలపై కేటీఆర్ సంచలన ప్రకటన

Update: 2020-03-11 23:30 GMT
హైదరాబాద్ అంటే చార్మినార్.. చార్మినార్ అంటే హైదరాబాద్. హైదరాబాద్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది అదే. అంతటి సింబాలిక్ పాతబస్తీకి మెట్రో సేవలు లేవు. ముందుకు సాగలేదు. నాడు ఇదే ఎంఐఎం నేతలు, ముస్లింలు తమ పాతబస్తీ గుండా మెట్రో వద్దంటే వద్దని అడ్డుకున్నారు. అలైన్ మెంట్ మార్చమన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో హిట్, సేవలు అందడం చూశాక.. తమకు కావాలంటున్నారు.

తాజాగా పాతబస్తీకి మెట్రోపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ప్రజా రవాణాకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వస్తోందని తెలిపారు. త్వరలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు ను పాతబస్తీ చార్మినార్ వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామని తెలిపారు. హెరిటేజ్ భవనాలను కాపాడుతామని తెలిపారు. ప్రభుత్వం ప్రజా రావాణాను కీలక అంశంగా తీసుకుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు.

ఇక రద్దీ ఎక్కువగా ఉండే జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకూ ట్రామ్ మార్గాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ 5 కి.మీల కారిడార్ ను చేపడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Tags:    

Similar News