తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాంచి ఉత్సాహం మీద కనిపిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి.. అక్కడి ముఖ్యంత్రి అఖిలేశ్ యాదవ్ మెచ్చుకోలుతోపాటు.. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం ప్రశంసల్ని సంపాదించుకొచ్చిన కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ విపక్ష నేత జానారెడ్డి పై ఫైర్ అయ్యారు.
అప్పుడెప్పుడో ఎనిమిది రోజుల క్రితం జానారెడ్డి తనపై చేసిన విమర్శల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు తమ సర్కారు అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ పథకం అవతలి రాష్ట్రం వారికి అర్థం అవుతుంటే. రాష్ట్రంలోని విపక్షాలకు మాత్రం అర్థం కావటం లేదని ఎద్దేవా చేసిన ఆయన.. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు అందుతాయని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా జానారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను గౌరవంగా జానారెడ్డిని పలుకరిస్తే.. నేనేంటో మీ అయ్యను అడుగు అని అన్నారని.. అయ్యదాకా ఎందుకు ఫ్లోరైడ్ తో బాధ పడుతున్న నల్గొండ జిల్లా అయ్యలకు జానా సంగతేంటో తెలుసంటూ మండిపడ్డారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి.. జాతీయస్థాయి నేతల పొగడ్తలతో కేటీఆర్ లో కాన్ఫిడెన్స్ మరింత పెరిగినట్లుంది. అందుకేనేమో.. ఎనిమిది రోజుల కిందటి విమర్శల్ని సైతం గుర్తుంచుకొని మరీ తిట్టేస్తున్నారే.