సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అంతా ఇంతాకాదు. కారు.. పదహారు అని చెప్పటమే కాదు.. కేంద్రంలో చక్రం తిప్పేది కారేనని చెప్పేవారు. అంతేనా.. కేంద్రం స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లోకి రానున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న వారు అవాక్కు అయిన పరిస్థితి. ఎంత పదహారు.. కాదంటే పదిహేడు సీట్లు ఉంటే మాత్రం.. మరీ ఇంత ఆత్మవిశ్వాసమా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే.. సార్వత్రిక ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలకు కారణమైందని చెప్పాలి.
ఎన్నికల ఫలితాలు ముగిసిన దాదాపు మూడు నెలల తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానాన్ని పార్టీ ఎందుకు కోల్పోయిందన్న విషయాన్ని తాజాగా చెప్పే ప్రయత్నం చేశారు. ఓటమికి కారణాలు చెప్పకున్నా ఫర్లేదు.. కానీ కవర్ చేసే ప్రయత్నం చేస్తేనే అసలు చిక్కంతా. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యల్ని వింటే.. ఆయనెంత రాంగ్ ట్రాక్ లో ప్రయాణిస్తున్నారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. కరీంనగర్ లో పార్టీ ఓటమికి కారణంగా పార్టీ క్యాడర్ అత్యుత్సాహంగా కేటీఆర్ అభివర్ణించటం గమనార్హం.
టీఆర్ ఎస్ శ్రేణుల అతి విశ్వాసతమే కరీంనగర్ ఎంపీ సీటును కోల్పోవటానికి కారణంగా కేటీఆర్ వ్యాఖ్యానించటం చూస్తే.. ఆయనకు అందుతున్న సమాచారం తప్పా? లేక.. ఆయన కావాలనే తప్పు చెబుతున్నారా? అన్న సందేహం కలుగక మానదు. అతి విశ్వాసం.. అలసత్వంతోనే సీనియర్ నేత వినోద్ ఓడిపోయినట్లుగా చెప్పిన కేటీఆర్.. కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత గురించి కానీ.. కరీంనగర్ సభలో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలే పార్టీ ఓటమికి కారణమన్న అసలు విషయాన్ని ప్రస్తావించకపోవటాన్ని చూస్తే ఆయనెంత రాంగ్ ట్రాక్ లో వెళుతున్నారో అర్థమవుతుందంటున్నారు.
ఒకవేళ పార్టీ క్యాడర్ అతివిశ్వాసమే కరీంనగర్ స్థానంలో ఓడిపోవటానికి కారణమనుకుంటే.. తన సోదరి పోటీ చేసిన నిజామాబాద్ లో ఓటమి సంగతేంటి? మల్కాజిగిరి.. సికింద్రాబాద్ సంగతేమిటి? అన్న ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు. ఓటమి తర్వాత అయినా ఆత్మపరిశీలన సరిగా లేకుండా జరిగే నష్టం భారీగా ఉంటుంది. ఆ విషయాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిదంటున్నారు. పార్టీ ఓటమిపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్ ఎస్ క్యాడర్ లో మరింత నిరాశకు గురి చేయటం ఖాయమంటున్నారు. ఎందుకంటే.. తమ సారథి.. ప్రజల మనసుల్ని తప్పుగా అర్థం చేసుకోవటాన్ని ఎవరు మాత్రం హర్షించగలరు?