లాక్ డౌన్ : మంత్రి కేటీఆర్ పిల్లలు ఏంచేస్తున్నారంటే ?

Update: 2020-03-27 19:30 GMT
కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి దేశం కూడా లాక్ డౌన్ అమలు చేస్తుంది. కరోనా కి మందు లేకపోవడం తో ఒకరిని నుండి మరొకరికి అంటుకోకుండా ఉండటానికి మన ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చింది. దీనితో పాఠశాలల నుండి షాపింగ్ మాల్స్ వరకు అన్నింటిని, కరోనా వైరస్ ముప్పు కారణంగా ప్రతిదీ మూసేసారు.

అయితే , ఈ ఖాళీ సమయంలో పిల్లలు బయటకి వెళ్లి ఆడుకోవాలని ప్రయత్నం చేస్తుండగా ..కరోనా భయంతో తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోవడంలేదు. ఇది సరైనదే. ఎందుకు అంటే హాలిడేస్ ఇచ్చింది ..ఎంజాయ్ చేయడానికి కాదు కదా. ఒక విపత్కర సమస్యతో పోరాడుతున్నాం కాబట్టి ..అందరూ కూడా దానికి తగ్గట్టు సహకరించాలి. పిల్లలు మారం చేసినా , ఏమి చేసినా కూడా బయటకి మాత్రం పంపే ప్రసక్తే లేదు అని తల్లిదండ్రులు ఖరాకండిగా చెప్తున్నారు.

దీనికి  తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ పిల్లలు దీనికి మినహాయింపు కాదు. అయితే , మంత్రి కేటీఆర్ పిల్లలు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం లేదు. అయితే , వారు ఏంచేస్తున్నారు అని అనుకుంటున్నారా? మంత్రి కేటీఆర్ పిల్లలు ఇద్దరు ప్రస్తుతం ఏంచేస్తున్నారో ..  కేటీఆర్ అందరితో పంచుకున్నారు. తాజాగా తమ పిల్లలు ఏంచేస్తున్నారో చూడండి అంటూ మంత్రి కేటీఆర్ ఒక ఫోటో ని షేర్ చేసారు. ఆ ఫొటోలో , కుమారుడు హిమాన్షు   కుమార్తె అలెక్యా రావు ఆన్‌ లైన్ క్లాస్ వింటూ చదువుకుంటూ బిజీగా ఉన్నారు. ఇద్దరూ ల్యాప్‌టాప్‌లను పట్టుకొని  చదువుకుంటున్నారు. ఇది  పరీక్షా సమయం ..కాబట్టి నా కొడుకు - కూతురు ఇద్దరు ఆన్‌ లైన్ లో క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారని  అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

కాగా , హిమాన్షు మరియు అలెక్య ఇద్దరూ హైదరాబాద్ లోని ఒక అంతర్జాతీయ  పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూల్స్ కి సెలవులు ఇవ్వడంతో ...ఆ స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ ద్వారా పిల్లలకి పాఠాలు బోధిస్తున్నారు. అయితే , లక్షల్లో ఫీజులు వసూలు చేసే అంతర్జాతీయ అంతర్జాతీయ పాఠశాలలో ఆన్ లైన్ క్లాసులు కూడా ముఖ్యమే అని చెప్పవచ్చు.
Tags:    

Similar News