కేసీఆర్ వల్లే జనగామ జిల్లా అయింది: కేటీఆర్

Update: 2020-02-26 12:02 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు - టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విపరీతమైన జనాదరణ ఉందన్న సంగతి తెలిసిందే. త్వరలోనే టీఆర్ ఎస్ పగ్గాలు కేటీఆర్ చేపట్టబోతున్నారని - కాబోయే సీఎం కేటీఆర్ అని తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే గత మునిసిపల్ ఎన్నికల్లో కేటీఆర్ తన ప్రచారంతో పార్టీని విజయపథంలో నడిపించారు. అయితే, ఈ గెలుపుతో పొంగిపోని కేటీఆర్....2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పల్లె పల్లెకు స్వయంగా వెళ్లి గ్రామస్థాయి నుంచి ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చామనే భావనను ప్రజల్లో కలిగిస్తూ ....తాను వారి మనిషిననే భావన కలిగిస్తున్నారు. తాజాగా జనగామలోని ధర్మకంచ బస్తీలో ఆకస్మికంగా పర్యటించిచ కేటీఆర్‌ అక్కడి ప్రజలతో ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ జిల్లా అయిందని, జనగామను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామలో కేటీఆర్‌ పర్యటించారు. తమ హయాంలో ప్రజల వద్దకే పాలన తెచ్చామని కేటీఆర్‌ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు బుట్టలు ఇచ్చారని.. డంపింగ్‌ యార్డుల్లో వేర్వేరుగా డంపింగ్ చేయ్యాలని చెప్పారు. తడి చెత్తతో ఎరువులు తయారు చేసి జనగామ పట్టణ ప్రజలకు అందిస్తామన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్కుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని, 6 నెలల్లో విద్యుత్‌ స్తంభాలు, వేలాడే వైర్ల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.


Tags:    

Similar News