అత్యున్నస్థాయిలో ఉన్న వారికి కోపం వస్తే..? ఏదైనా విషయం మీద విపరీతమైన అసంతృప్తికి గురైతే..? పనులు యమా ఫాస్ట్ గా జరిగిపోతాయని అనుకుంటారు. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిగా చెప్పుకునే కేటీఆర్ నోటి నుంచి రావటం ఆశ్చర్యానికి గురి చేసే అంశంగా చెప్పాలి. ఎందుకంటే..కేటీఆర్ స్థాయి నేత నోటి నుంచి వచ్చిన తర్వాత పనులు జరగకపోవటం ఏమిటన్నది అంతుబట్టని వ్యవహారంగా మారిందని చెప్పొచ్చు.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ రోడ్లు దారుణంగా తయారైన నేపథ్యంలో మీడియా మొదలు అందరూ తిట్లదండకం అందుకున్న వేళ.. మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆకస్మిక తనిఖీల పేరిట ఉదయం వేళ ఒకసారి.. అర్థరాత్రి వేళ మరోసారి తనిఖీలు నిర్వహించిన ఆయన రోడ్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. పరిస్థితి మొత్తం మారిపోవాలని ఆదేశించారు. పది రోజుల వ్యవధిలో మొత్తంగా మారుతుందని చెప్పినా.. తర్వాత ఆ గడువును మరికాస్త పెంచారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ రోడ్ల తీరుపై తనకున్న కొత్త కొత్త ఆలోచనల్ని వెల్లడించిన కేటీఆర్.. గ్రేటర్ రోడ్ల మీద సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సైతం అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని చెప్పారు.
ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టాలి. రోడ్ల మొత్తం తళతళలాడేటట్లు కాకున్నా.. ఒకమోస్తరుగా అయినా మారిపోవాలి. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా ఉమ్మడిరాష్ట్రంలో జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. ఇప్పటి మాదిరే రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆ సమయంలోనూ మీడియా మొదలుకొని రాజకీయ నేతలు వరకూ ప్రభుత్వ తీరును తప్పు పట్టేవారు. ఈ అంశం మీద కిరణ్ కుమార్ రెడ్డి ఫోకస్ చేయటం.. ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి.. లక్ష్యాన్ని విధించిన వారం రోజులకు రోడ్లు మొత్తం యుద్ధ ప్రాతిపదికన మారటాన్ని మర్చిపోలేం. అయితే.. ఆ సందర్భంగా వేసిన రోడ్ల నాణ్యత విషయాన్ని ఇక్కడ ప్రస్తావించటం లేదు. ఇక్కడ చెప్పదలుచుకున్నది కేవలం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆగ్రహం వస్తే ఎలాంటి మార్పులు వస్తాయనటానికి ఆ ఉదంతం ఒకటి నిదర్శనంగా చెప్పొచ్చు.
అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారిన టీఆర్ ఎస్ సర్కారు.. ప్రభుత్వ యంత్రాగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించటంలో ఎందుకు విఫలమవుతున్నట్లు? అన్నది పెద్ద ప్రశ్న. కేటీఆర్ స్థాయి నేత స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రావటం తర్వాత సంగతి.. తనకీ ఫ్రస్టేషన్ ఉందని.. కానీ తానేమీ చేయలేకపోతున్నానని చెప్పటం విస్మయానికి గురి చేసే అంశం. ముఖ్యమంత్రి.. తానూ ఇదే రోడ్ల మీద తిరుగుతున్నామని.. ప్రజలతో తిట్లు తినాలని.. ప్రభుత్వానికి.. అధికారులకు లేదని చెబుతూనే.. వచ్చే వర్షాకాలానికి రోడ్ల విషయంలో మార్పులు రావొచ్చని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే.. మరో ఏడాదికి కూడా మార్పులు కచ్ఛితంగా వస్తాయన్న నమ్మకం కేటీఆర్ కు లేదనటం షాకింగ్ అంశంగా చెప్పాలి. రాష్ట్ర మొత్తం వాటర్ లైన్ ఇవ్వటానికి ఐదేళ్లు సరిపోతుందని.. లేకుంటే ఓట్లే అడగమని చెప్పిన సర్కారుకు.. హైదరాబాద్ రోడ్లను మార్చటానికి మాత్రం ఏడాది సమయం కావాలనటం దేనికి నిదర్శనం..?