మోసం చేసిన మీడియా అధినేతల పేర్లు చెబుతా..

Update: 2018-12-06 04:44 GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మిత్రులు  ఎవరో, శత్రువులు ఎవరో తెలంగాణ ఎన్నికల వేళ తెలిసిపోయిందని.. ఆ రెండు పత్రికలు హఠాత్తుగా ఎన్నికల వేళ రంగులు మార్చేశాయని ఆరోపించారు. సదురు పత్రాకాధినేతలు, చంద్రబాబు కలిసే లగడపాటి పై ఒత్తిడి తెచ్చి మహాకూటమి హవా ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

ఆ మీడియా సంస్థల అధిపతులు ఎవరన్నది ఈనెల 11న చెబుతానని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసే సమయంలోనూ సదురు మీడియా సంస్థలు టీడీపీతోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

నవంబర్ 20న చేసిన సర్వేలో టీఆర్ఎస్ 65-70 సీట్లు వస్తాయని లగడపాటి చెప్పారని.. ఆ తర్వాత ఎలాంటి సర్వే చేయలేదని లగడపాటి స్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ వివరించారు. మరి సర్వే చేయకుండానే మహాకూటమి ఎలా పుంజుకుంటుందని.. ఇదంతా చంద్రబాబు.. ఆ పత్రికాధినేతలు కలిసి చేసిన కుట్రగా కేటీఆర్ అభివర్ణించారు. ఆకస్మాత్తుగా రంగులు మార్చిన ఆ పేపర్ల బండారం డిసెంబర్ 11న వెల్లడిస్తానని కేటీఆర్ సంచలనం రేపారు.
Tags:    

Similar News