ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ చిత్తుగా ఓడిపోయి...బీజేపీ గద్దెనెక్కడం తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఒకింత కలవరపాటుకు గురిచేసిందనే చర్చ జర్నలిస్టు వర్గాల్లో సాగుతోంది. ఎస్పీ ఓటమి - బీజేపీ గెలుపు తెలంగాణ మంత్రి అయిన కేటీఆర్ ను ఎందుకు ఆశ్చర్యకరంగా మారిందనే సందేహం మనకు కలగడంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే యూపీ మాజీ సీఎం - ఎస్పీ యువనేత అఖిలేష్ యాదవ్ - తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిన వారు మాత్రం కేటీఆర్ కలవరపాటులో అర్థం ఉందని చెప్తున్నారు.
యువనేత అయిన అఖిలేష్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలో దేశంలోని మెరుగైన విధానాలను తన పరిపాలనలో భాగం చేయాలని చూశారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ ఆయనకు ఎంతో నచ్చింది. దీంతో ఈ పథకం గురించి తెలుసుకున్న అఖిలేష్ తన సమ వయస్కుడైన కేటీఆర్ దీనికి బాద్యుడని తెలిసి ఆశ్చర్యపోయారట. అందుకే కేటీఆర్ ను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ పిలిపించి అక్కడ మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర అధికారులను ప్రత్యేకంగా పంపించి తెలంగాణలో అధ్యయనం చేయించారు. ఇక కేటీఆర్ సైతం అఖిలేష్ పై ప్రేమను చాటుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. యూపీ ఫలితాలకు రెండు రోజుల ముందు కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ ఒకటి చేశారు. అదేంటంటే..."యూపీ సీఎం అఖిలేష్ అత్యుత్తమ పరిపాలకుడు. నేను కలిసిన అత్యుత్తమ సీఎంలలో ఆయన ఒకరు." అంటూ తనకు అఖిలేష్ అంటే ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ఎన్నికల ఫలితాల్లో ఎస్పీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని చూస్తున్న పలువురు... కేటీఆర్ మెచ్చిన అత్యుత్తమ సీఎం ఓటమి పాలయ్యారంటే ఆయన ఎంత హర్ట్ అయి ఉంటారో అంటూ చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/