జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ వంద సీట్లు గెలుస్తామని సవాల్ విసిరారు. అది అన్నట్లే జరిగింది. మరి ఆయనకు ఈసారి ఏం నమ్మకం ఉందో...ఇపుడు కూడా వంద సీట్లు గెలుస్తాం అని చెబుతున్నారు. మరి సర్వేల లెక్క చూస్తే భిన్నంగా ఉంది. ఇదంతా ఒకెత్తు. ఈ విషయాన్ని పక్కన పెడదాం. కేటీఆర్ రేవంత్‌కు ఓ సవాల్ విసిరారు.
ఇంతకీ కేటీఆర్ విసిరిన సవాల్ ఏంటంటే... కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల పోరులో రేవంత్ రెడ్డి ఓడిపోతారని కేటీ రామారావు ఖరాకండిగా చెప్పారు. ఒకవేళ అలా జరగని పక్షంలో ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారని అన్నారు. ఆయన సవాల్ కు నేను సిద్ధంగా ఉన్నానని - ఒకవేళ కొడంగల్ లో నేను గెలిస్తే కల్వకుంట్ల కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుందా? అని ఆయన ప్రతి సవాల్ అని ప్రశ్నించారు. తాను గెలవడమే కాదని - కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని - అత్యధిక స్థానాలు రాష్ట్రంలో కాంగ్రెస్ కే వస్తాయని రేవంత్ వ్యాఖ్యానించారు.